చిత్ర పరిశ్ర‌మ‌లో కొన్ని పాత్రలు కొంత మంది హీరోలు కోసమే పుట్టాయ అన్నట్టుగా ఉంటాయి. ఆ  పాత్రల కోసం వాళ్లు తప్ప మరెవరు చేయలేరు అనంత గా ప్రేక్షకులు మనసు లో నిలిచిపోతారు అలాంటి హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు . ఈయన హీరో గా నటించిన తొలిప్రేమ - తమ్ముడు వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి . ఈ రెండు సినిమాల స్టోరీని పవన్ కళ్యాణ్ తన నటనతో డామినేట్ చేశాడని కూడా అంటారు .


ఆ స్థాయిలో తన నటనతో ఆ పాత్రలో పవన్ కళ్యాణ్ తప్ప మరి ఏ హీరో చేయలేడు అనేలా ఆయన జీవించాడు . ఇక ఇదే క్రమంలో ఇలా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కారణంగా విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఇంత‌కి ఆ సినిమా మరేదో కాదు వాసు . పవన్ కళ్యాణ్ కు తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కరుణాకరన్ ఈ సినిమాను తెర్కక్కించాడు . ఈ సినిమా కథ పరంగా పాటలు పరంగా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది . ఈ సినిమాని ఇప్పటికీ కూడా చూసే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు . ఇంత మంచి సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది అంటే ఎవరు నమ్మలేరు అనేది కూడా నిజం.


అందుకు కారణం గతం లో పవన్ కళ్యాణ్ ఇదే తరహా సినిమాల్లో ఇదే రకమైన పాత్రలు పోషించి , జనాల్లో నాటుకుపోయాడు . ఈ సినిమాని చూస్తున్నంతసేపు వెంకటేష్ ని ఎవ్వరూ చూడలేదు , ఆయన స్థానం లో పవన్ కళ్యాణ్ ని ఊహించారు . అందుకే కమర్షియల్ గా ఈ చిత్రం వర్కౌట్ కాలేదని అంటుంటారు విశ్లేషకులు . తొలిప్రేమ సినిమా తో మంచి సక్సెస్ అందుకున్న కరుణాకరన్ కి ఈ చిత్రం రూపం లో ఫ్లాప్ ఎదురైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: