ఈ సినిమాలో నమ్రత హీరోయిన్గా నటించింది. 2000 సంవత్సరం అక్టోబర్లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది . అయితే ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరిగే సమయంలో మహేష్ - నమ్రత మధ్య ప్రేమ చిగురించిందట .ఆ సినిమా షూటింగ్ దగ్గర నుంచి నాలుగు సంవత్సరాలకు పైగా ప్రేమించుకున్న ఈ జంట 2005 లో ముంబైలో వీరు వివహం చేసుకున్నరు .. ఇక మహేష్ తన సినీ కెరియర్లో బాగా డిస్టర్బ్ చేసి పరువు తీసిన సినిమాలు బాబీ - బ్రహ్మోత్సవాన్ని అంటారు. కానీ మహేష్ కు మాత్రం వ్యక్తిగతంగా పరువు తీసిన సినిమా వంశీ .. తన తండ్రి కృష్ణతో కలిసి నటించడం, అదేవిధంగా తన సొంత బ్యానర్, తన భార్య నమ్రతతో ప్రేమ చిగురించిన సినిమా వంశి డిజాస్టర్ అవ్వటం మహేష్‌ను ఎంతగానో బాధించింది.
ఇక కథ కూడా రెడీ కాకుండా హడావిడిగా సినిమా చేసేశారు. దర్శకుడు బి.గోపాల్ అదే సమయంలో బాలయ్యతో నరసింహానాయుడు చేస్తూ ఆ సినిమాపై ఎక్కువ ఫోకస్ చేయడం వళ్ళే వంశీ ప్లాప్ అవ్వడానికి కారణమని టాక్ ఉంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా మహేష్‌కు సినిమా తేడా కొడుతుందని అర్థమైపోయిందట. రిలీజ్ అయ్యాక మహేష్ జోస్యం నిజమై సినిమా ప్లాప్ అయ్యింది. కనీసం ఆర్టిస్టుగా కూడా మహేష్‌కు ఏ మాత్రం సంతృప్తి కలిగించని సినిమాగా వంశీ రికార్డులకు ఎక్కింది . అయితే ఈ ప్లాప్ సినిమాయే నమ్రతకు బాగా ఇష్టం అట. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు నమ్రత ఎంజాయ్ చేస్తూ సినిమా చేయడం.. అదే టైంలో మహేష్‌తో తొలి చూపులోనే ప్రేమలో పడడంతో ఆ మెమరబుల్ మూమెంట్స్ ఆమెకు బాగా గుర్తుండిపోయాయి .