ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అల్లు అర్జున్ చేసిన ఓ పని ఆంధ్రాలో సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ ముఖ్యంగా మెగా ఫాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని కలిసిన బన్నీ.. ఆయన గెలవాలని శుభాకాంక్షలు తెలుపగా... ఇది మెగా అభిమానులు ఒక్కసారిగా అల్లువారి అబ్బాయిపై విరుచుకుపడ్డారు. ఓ వైపు వైసీపీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ నినాదాలు చేస్తే, ఆ పార్టీ అభ్యర్థి గెలవాలని కోరుకుంటూ నంద్యాల వెళ్లడం ఏంటి?అని మెగా ఫ్యాన్స్ ఫైర్ కావడం జరిగింది. అయితే ఆ వేడి ఇంకా చల్లారలేదు.. అది వేరే విషయం అనుకోండి!

అయితే, ఎట్టకేలకు ఈ వివాదానికి బన్నీ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయబోతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకి ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పటికే 3 సీజన్లు విజయవంతంగా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్ షురూ చేసింది. మొదటి ఎపిసోడ్ కి ఏపీ సీఎం చంద్రబాబు గెస్ట్ గా రావడం జరిగింది. ఇంకా ఈ సీజన్ లో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా సందడి చేయనున్నట్టు వినికిడి. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 5న విడుదల కానున్న 'పుష్ప-2' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ కూడా సందడి చేయనున్నాడట.

ఇక రీసెంట్ గా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూట్ కూడా పూర్తయినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఈ ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందని, ముఖ్యంగా నంద్యాల టూర్ గురించి బన్నీని బాలయ్య సూటి ప్రశ్నలు అడగగా అసలు తాను నంద్యాల ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో, తన ఉద్దేశమేంటో అల్లు అర్జున్ క్లారిటీ గా చెప్పాడని అల్లువారి కంపౌండ్లో టాక్ నడుస్తోంది. దాంతో ఈ ఎపిసోడ్ రిలీజ్ తర్వాత బన్నీపై మెగా ఫ్యాన్స్ కోపం పూర్తిగా తొలిగిపోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: