టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య, బాలీవుడ్ బ్యూటీ శోభిత ధూళిపాల పెళ్లి తేదీ ఫిక్స్ అయింది. ఈ జంట డిసెంబర్ 4న వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. 2024 ఆగస్టు 8న నాగచైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అవ్వడంతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఇరు కుటుంబాలు కలిసి పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే శోభిత ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం జరిగింది. ఆమె తన సోషల్ మీడియాలో ఈ ఫొటోలను షేర్ చేయడంతో పెళ్లి వార్తలు మరింత ఊపందుకున్నాయి. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య, శోభిత ప్రేమలో పడ్డారు.

కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. అక్కినేని ఫ్యామిలీ కూడా ఈ వివాహంపై చాలా ఆనందంగా ఉంది. నాగచైతన్య కొత్త జీవితానికి అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ వివాహం నాగచైతన్య, శోభిత ఇద్దరి సినిమా కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’ సినిమాలో నటిస్తున్నాడు. శోభిత కూడా బాలీవుడ్, హాలీవుడ్‌లో అవకాశాలు అందుకుంటోంది. అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల వివాహం టాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఈ జంటకు అభిమానుల నుండి అనేక శుభాకాంక్షలు వస్తున్నాయి.

డిసెంబర్ 4న జరగబోయే ఈ వివాహం టాలీవుడ్‌లో మరపురాని సంఘటనగా నిలుస్తుందని అంచనా.  తాజాగా జరిగిన అక్కినేని నాగేశ్వరరావు గారి నేషనల్ అవార్డ్‌ 2024 ఈవెంట్‌ లో ఈ విషయం బయటపడినట్టు సమాచారం. ఇందులో భాగంగా డిసెంబర్ రెండో తేదీన సంగీత్, మూడో తేదీన మెహందీ, నాలుగో తేదీన పెళ్లి జరగబోతుందట. అంతేకాదు డిసెంబర్ 10వ తేదీన గ్రాండ్‌గా హైదరాబాదు లో భారీ రిసెప్షన్‌ ని పెట్టబోతున్నారట. అయితే పెళ్లికి చాలా తక్కువ మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నారట నాగార్జున. కానీ రిసెప్షన్‌ కి మాత్రం అటు పొలిటికల్ ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులను పిలవబోతున్నారట. ప్రస్తుతం ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: