తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన రాజా వారు రాణి గారు అనే సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో ఈయన మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈయన అనేక సినిమాల్లో హీరోగా నటించిన అందులో సమ్మతమే , వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలో నటించి మంచి విజయాలను అందుకున్నాయి. ఆఖరుగా ఈ నటుడు రూల్స్ రంజన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే తాజాగా ఈ యువ నటుడు "క" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని రేపు అనగా ఆక్టోబర్ 31 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు దాదాపు 10 కోట్ల ప్రి రిలీజ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ 11 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ నుండి ఇప్పటివరకు మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం , అలాగే ఈ సినిమాలో హీరోగా నటించిన కిరణ్మూవీ బృందం అంతా ఈ సినిమా గురించి సూపర్ పాజిటివ్గా చెబుతూ రావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కాకపోతే ఈ సినిమాకు ఒక పెద్ద సమస్య వచ్చినట్లు తెలుస్తుంది. అదేమిటి అంటే ఈ మూవీ కి పెద్ద సంఖ్యలో థియేటర్లు దొరకడం లేదు అని ఓ వార్త వైరల్ అవుతుంది.

రేపు అనగా దీపావళి సందర్భంగా చాలా సినిమాలు విడుదలకు రెడీగా ఉండటం వల్ల అన్ని సినిమాలకు థియేటర్లను సర్దుబాటు చేయగా ఈ మూవీకి తక్కువ థియేటర్లు వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఒక వేళ మంచి పాజిటివ్ టాక్ ఈ మూవీ కి వస్తే థియేటర్స్ ను పెంచుతారు. పెరుగుతాయి కలెక్షన్లు ఈజీగా వస్తాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా ఇలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: