అయితే ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ బ్లాక్ థీమ్, డార్క్ విజువల్స్‌తోనే దాదాపుగా తెరకెక్కడం వలన ప్రేక్షకులకు కొంత రొటీన్ అనే ఫీలింగ్ కలుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడగా, ఎన్టీఆర్‌తో తీసే కొత్త ప్రాజెక్ట్ కోసం మాత్రం ప్రశాంత్ కొన్ని మార్పులు, చేర్పులు చేయనున్నారని వినికిడి. ఈ సినిమాకి కథా నేపథ్యం, విజువల్స్ లో కొత్తదనం చూపించేలా ప్లాన్ చేస్తున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం. అవును, ప్రశాంత్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఈ సినిమాతో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి విదితమే.
ఇక ప్రశాంత్ - ఎన్టీఆర్ భారీ ప్రాజెక్ట్‌కి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు చేపడుతున్న సంగతి విదితమే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ ప్రాజెక్ట్‌పై తారక్ అభిమానులు అయితే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ హీరోగా ఈమధ్యకాలంలో రిలీజైన సినిమాల విషయంలో అభిమానులు పెద్దగా సంతృప్తి పడిన దాఖలాలు కనబడడంలేదు. దాంతో ఈ సినిమాతో అయినా అతని పాత్రలో కొత్తదనం కనిపిస్తుందని ఆశిస్తున్నారు. బంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని కూడా టాక్ నడుస్తోంది. అక్కడ ఉండే తెలుగు వారికి సపోర్ట్ గా హీరో ఎలా నిలిచాడు అనే స్టోరీ లైన్ తో ఈ సినిమా కథాంశం ఉంటుందని భోగట్టా.