మనకు తెలిసిందే ఎప్పటినుంచో చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. నిజానికి అనిల్ రావిపూడి కి చిరంజీవి అంటే చాలా చాలా ఇష్టం ..బిగ్ ఫ్యాన్ అనే చెప్పాలి . ఆయనతో సినిమా కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు . కధ విషయంలో కొన్ని కండీషన్స్ వల్ల పెండింగ్ పడుతూ వస్తూ వచ్చిందట. అయితే షైన్ స్క్రీన్స్ ఈ కాంబినేషన్ సెట్ చేయడానికి చాలా చాలా ట్రై చేసింది కానీ పని అవ్వడం లేదు అంటూ ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తుంది . అయితే ఇప్పుడు చిరంజీవి కోసం రాసుకున్న కథతో అనిల్ రావిపూడి బాలయ్య తో సినిమాను తెరకెక్కిస్తున్నాడట . దీని గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .
వెంకటేష్ 76వ సినిమాతో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో కంప్లీట్ చేసేస్తాడట . ప్రమోషన్స్ అరాకొరా పనులన్నీ కూడా ఫిబ్రవరి ఎండింగ్ కి ఫినిష్ అయిపోతాయి . ఆ తర్వాత బాలకృష్ణతో కొత్త సినిమాను సెట్స్ పై కి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడట . నిజానికి ఈ కథను ముందుగా చిరంజీవితో చేయాలి అనుకున్నాడట అనిల్. కానీ ఆయన ఎంత వరకు సినిమా కథ విషయంలో ముందుకు రాకపోవడంతో ఫైనల్లీ నిరుత్సాహం చెందిన అనిల్ ఆయన లక్కీ హీరో బాలయ్యకే ఛాన్స్ ఇచ్చాడట . భగవంత్ కేసరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే . మరొకసారి అదే తరహాలో కాంబో సెట్ కాబోతూ ఉండడంతో చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్.
ప్రజెంట్ బాబీతో 109 సినిమా చేస్తూ బిజీగా ఉన్న బాలయ్య ఆ తర్వాత 110 ను బోయపాటితో ఫిక్స్ అయ్యాడు . 111 సినిమాను బాలయ్య ..అనిల్ రావిపూడి తో కమిట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిని జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు . చిరంజీవి మెగా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసుకుని మంచి మంచి కథలను వదులుకుంటున్నాడు అని అనిల్ రావిపూడి ఇలాంటి డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తానికి మంచి లైఫ్ ఉండేది అని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఆచార్య సినిమా తర్వాత ఆయన ఓ ఈవెంట్లో మాట్లాడిన మాటలు కొరటాల శివకు బాగా హర్టింగ్గా అనిపించాయి అంటూ కూడా ప్రచారం జరిగింది .అప్పట్లో చిరంజీవికి నోటి దూల ఎక్కువ అంటూ కూడా మెగా హేటర్స్ ట్రోల్ చేశారు . అంతేకాదు ఇప్పుడు మంచి సినిమాను మంచి డైరెక్టర్ వదులుకోవడం..ఆ కధ కి బాలయ్య ఓకే చెప్పడంతో.. బాలయ్య కష్టాన్ని నమ్ముకునే వ్యక్తి అంటూ ఆయనను పొగిడేస్తున్నారు . బాలయ్య - చిరంజీవికి భారీ షాక్ ఇచ్చిన్నట్లు అయ్యింది అంటూ ప్రచారం చేస్తున్నారు..!