తెలుగు సినీ ప్రేక్షకులకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జంట కలిసి నటించిన చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం అసలు ప్రేమ అని గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియకపోయినా సోషల్ మీడియాలో ఈ జంట గురించి చర్చలు మాత్రం ఎప్పుడూ తగ్గవు. గీత గోవిందం సినిమాతో వీళ్ళిద్దరి మధ్య రియల్ లైఫ్ లో కూడా ప్రేమ మొదలైంది అనే వార్త అయితే వినిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడు మీడియా ముందు మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోలేదు. ఇకపోతే వీళ్ళిద్దరూ చెప్పే కొన్ని మాటలు అదే కాకుండా సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని తెలియజేస్తూనే ఉంటాయి.

 ఇక ఆ ఫోటోలు కూడా క్షణంలో వైరల్ అవుతూ ఉంటాయి.  విజయ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు అంతేకాకుండా రష్మిక ఇంస్టాగ్రామ్ ఫోటోలు చూస్తే వీళ్లిద్దరూ తరచూ చట్టా పట్టాలు వేసుకొని మరి తిరుగుతున్నారు అన్న సంగతి వీళ్ళ అకౌంట్లను ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఇక ఇప్పుడు కూడా ఇదే రిపీట్ అయింది.  దీపావళి పండుగ  ముందుగా వీరిద్దరూ ఇప్పుడు కలిసి ముంబైకి వెళ్లారు ఒకేసారి ముంబైలో దిగిన వీళ్ళ జంట ఎక్కడ మీడియాకి దొరికిపోతాము అని ఎయిర్ పోర్ట్ లో వేరువేరు గెటప్స్ నుంచి బయటకు వచ్చారు. అయితే ఒకే ఫ్లైట్ లో  దిగి ఒకే టైంలో ఇలా వేరువేరు గెటప్స్ నుంచి వచ్చిన మాత్రాన నిజమైతే తెలియకుండా ఉండదు కదా.

ప్రస్తుతం ఈ ప్రేమ జంట వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోసారి చెప్పక్కనే వీళ్ళిద్దరి ప్రేమను చెప్పేశారు అంటూ అభిమానులు నేటింట కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే కొంతకాలంగా విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్‌ తో కలిసి మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి కాంబోలో వచ్చిన 'పెళ్లి చూపులు' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అందుకే ఈ కాంబోలో మరో సినిమా రాబోతున్నదనే వార్త వినగానే అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఇక ఈ సినిమా కథను డైరెక్టర్ విజయ్ కి చెప్పినట్టు విజయ్ కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాతో విజయ్ కి కొత్త హీరోయిన్ ను పరిచయం చేయనున్నాడట దర్శకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: