తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరోగా నటించిన ఎన్టీఆర్ కు ఓ సీజన్ మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ఆ సీజన్ మరేదో కాదు సంక్రాంతి. సంక్రాంతి పండుగ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన 5 సినిమాలు ఇప్పటివరకు విడుదల అయ్యాయి. అందులో కేవలం రెండు సినిమాలు మాత్రమే విజయాలను అందుకోగా మిగిలిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. ఆ మూవీలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత మొదటి సారి సంక్రాంతి సీజన్ కి నా అల్లుడు అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాలో శ్రేయ , జేనీలియా హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రావాలా అనే సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఫ్లాప్ అయ్యింది. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ "నాగ" అనే మూవీతో సంక్రాంతి బరిలో నిలిచాడు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన అదుర్స్ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది.


మూవీ మంచి విజయాన్ని అందుకుంది. వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆఖరుగా జూనియర్ ఎన్టీఆర్ సంక్రాంతి బరిలో నాన్నకు ప్రేమతో అనే సినిమాతో నిలిచాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఏ సినిమాలో హీరోయిన్గా నటించగా ... సుకుమార్మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా ఐదు సినిమాలతో సంక్రాంతి బరిలో నిలిచిన జూనియర్ ఎన్టీఆర్ కి మూడు సినిమాలతో ఫ్లాపులు , రెండు సినిమాలతో విజయాలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: