అక్కినేని నాగార్జున తన వందవ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు . అంతేకాదు స్టార్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టాడు అంటూ ప్రచారం జరుగుతుంది . నాగార్జున కూడా ఆ డైరెక్టర్ పేరుని నో చెప్పకపోవడంతో అందరూ ఇది నిజమే అంటూ భావిస్తున్నారు. కాగా నాగార్జున వందవ సినిమాలో హీరోయిన్గా మొదట త్రిష ని అనుకోగా ఆ తర్వాత ఆమెను తప్పించి ఆమె ప్లేస్ లో కాజల్ అగర్వాల్ ని ఫిక్స్ చేసుకున్నట్లు ఓ వార్త బాగా ట్రెండీగా మారింది .
అయితే ఇప్పుడు నాగచైతన్య సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ నటించబోతుంది అంటూ ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది . ప్రజెంట్ తండేల్ మూవీ కోసం బాగా కష్టపడుతున్న నాగచైతన్య. ఆ తర్వాత విరుపాక్ష డైరెక్టర్ తో ఒక మూవీకి కమిట్ అయ్యాడు . ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు. కాగా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుందట. అయితే నాగచైతన్యకు తల్లి పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించబోతుందట . అట్ ఏ టైం ఒక పక్కన నాగార్జునకి భార్యగా మరొక పక్కన నాగచైతన్యకు తల్లిగా కాజల్ అగర్వాల్ రెండు సినిమాలను ఓకే చేస్తుంది అన్న వార్తలు బయటకు రావడంతో ఆమె పేరు సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా ట్రెండ్ అవుతుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే.. కాజల్ కెరియర్ ఇక ఫుల్ స్టాప్ పడేదే లేదు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . చూద్దాం మరి కాజల్ అగర్వాల్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు ఆమెకు సక్సెస్ ఇస్తుందో..?