టాలీవుడ్ లోకి ఎంతోమంది యంగ్ హీరోలు వస్తున్నారు. అందులో కిరణ్ అభవరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరో నటించింది కొన్ని సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. కిరణ అబ్బవరం తాజాగా 'క' అనే పాన్ ఇండియా సినిమాతో అక్టోబర్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. నయన్ సారిక, తన్వీర్ రామ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. శ్రీమతి చింత వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాణంలో సుజిత్, సందీప్ డైరెక్టర్లుగా ఈ సినిమాని తెరకెక్కించారు.


"క" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం రోజున హైదరాబాదులో జరిగింది. ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు. ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా తాను ఎదిగిన తీరుని వెల్లడించాడు. అంతేకాకుండా ఈ సినిమాని తనతో పాటు మూవీ టీం అంతా ఎంతో కష్టపడి తీశారని, ఈ సినిమా బాలేదు అని ఎవరికి అనిపించినా నేను సినిమాలు మానేస్తానని కిరణ్ అబ్బవరం అన్నాడు.


ఈ సినిమాని ప్రతి ఒక్కరు కొన్ని సంవత్సరాల పాటు గుర్తుంచుకుంటారని, ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేలా ఈ సినిమా ఉంటుందని కిరణ్ అబ్బవరం అన్నాడు. ఈ సినిమా విడుదల రోజున అమరన్, లక్కీ భాస్కర్ వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.... మీరు నా సినిమాని చూసి ఆదరిస్తారనే నమ్మకంతో అదే రోజున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నానని వెల్లడించాడు.


ఇక సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.... డైరెక్టర్ కథ చెప్పిన సమయంలో వాసుదేవ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఒక క్లారిటీకి నేను వచ్చానని అన్నాడు. 1977 సంవత్సరంలో కృష్ణగిరి ఊరిలో అభినయ వాసుదేవ్ అనే పోస్ట్ మ్యాన్ పాత్రలో నేను నటించాను. నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి సినిమా కథను త్వరగా అర్థం చేసుకోగలిగానని కిరణ్ అబ్బవరం తెలిపాడు. ఇక ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీన అంటే రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: