సినిమా స్టోరీ విషయానికి వస్తే.. అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఎవరూ లేని అనాధగా జీవిస్తూ ఉంటారు. ఇతరుల ఉత్తరాలను సైతం చదువుతూ వాటిని తన సొంత వాళ్లే రాసినట్లుగా ఊహించుకొని ఆ రాత్రంతా కూడా తన బంధాలను చూసుకుంటూ ఉంటారు. అయితే ఒకసారి ఇలా దొంగతనంగా ఉత్తరాలు చదువుతున్నారని తన మాస్టర్ గురునాథం (జయరాం) వాసుని కొట్టగా ఆ ఆశ్రమం నుంచి పారిపోతాడు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకి కృష్ణగిరికి వచ్చి అక్కడ కాంట్రాక్ట్ పోస్ట్మాన్ గా పనిచేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే పోస్ట్మాన్ రంగారావు (అచ్యుత్ కుమార్) కుమార్తె సత్యభామ (నయన సారిక) ప్రేమలో పడతారు.. అలాగే ఆ ఊర్లో కూడా కొంతమంది అమ్మాయిలు కనిపించకుండా పోతూ ఉంటారు.. అయితే వాసుకి ఉత్తరాలు చదివే అలవాటు ఉండడంతో ఒక లెటర్ వల్ల ఈ అమ్మాయిలు అందరూ మిస్సింగ్ అవుతూ ఉంటారని దొరుకుతుంది. ఆ తర్వాత వాసుదేవ జీవితం ఎలా మలుపు తిరుగుతుంది క్రిష్ణగిరిలో ఏం జరిగింది ఆ ముసుగు వ్యక్తి ఎవరు అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
ఇప్పటివరకు క లాంటి సినిమా కాన్సెప్ట్ అయితే రాలేదని ప్రేక్షకులు తెలుపుతున్నారు. ఈ సినిమా కోసం ఎంచుకున్న కథ, కృష్ణగిరి ఊరు అందులో సమస్య.. పరిష్కరించే సమయంలో హీరోకి ఎదురయ్యే సవాళ్లు అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా అంతా కూడా ఒకే ఎత్తు అయితే విరామం ముందు వచ్చే సన్నివేశాలు మరింత ఆకట్టుకున్నాయట. ఈ రెండు సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బుర్ర తిరిగిపోయేలా చేశాయని తెలుపుతున్నారు. సరికొత్త అనుభూతిని తీసుకువెళ్లాయని.. మనిషి పుట్టుక విషయంలో కర్మఫలం రుణానుబంధం అని ఈ మూడు అంశాలను హైలెట్ చేశారని ప్రేక్షకులు తెలుపుతున్నారు.
ఇక నటి నటుల యాక్టింగ్ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో మరొకసారి తన కెరీర్ ని మలుపు తిప్పుకుంటున్నారని తెలుపుతున్నారు. యాక్షన్స్ సన్ని వేషాలు ఆకట్టుకొనే థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయని తెలుపుతున్నారు. నయన సారిక లుక్స్ అందం హైలెట్ గా ఉందని. తన్వి రామ్ది ప్రాధాన్యత ఉండే పాత్ర.. అలాగే ఇతరులు కూడా ఇందులో అద్భుతంగా నటించారు. రెండవ భాగంలో వచ్చే ట్విస్టులు అన్నీ కూడా ఆకట్టుకున్నాయని.. క అనే పదానికి అర్థం వెనుక సినిమా బాగుందా తెలుపుతున్నారు. ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచం పరిచయాన్ని చేశారు దర్శకులు సుజిత్ సందీప్.
ఈ సినిమాకి బలాలు:
కథ కథనాలు, హీరో కిరణ్ అబ్బవరం నటన ,ఇందులో వచ్చేటువంటి ట్విస్టులు.
మైనస్ ఏమిటంటే ఊహలకు తగ్గట్టుగా సాగి కొన్ని సన్నివేశాలు.