ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని పాటలు విడుదలైన సంగతి తెలిసిందే. అవి సోషల్ మీడియాలోనూ ట్రెండ్ కూడా అయ్యాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలోనే నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ఈవెంట్ కు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో కాకుండా ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాలని అనుకుంటున్నారట.
అయితే నవంబర్ 28వ తేదీ వరకు హైదరాబాద్ లో ప్రభుత్వం 144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే. సుమారు నెలరోజుల పాటు రోడ్ల మీద గుంపులు గుంపులుగా కనిపించడం, ర్యాలీలు చేయడం, సభలు నిర్వహించడాన్ని నిషేధించారు. ఇంటలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం కమిషన్ సివి ఆనంద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణం వల్లనే పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయ్యింది. ఈ కారణంగానే ఈవెంట్ ను ఏపీలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట.
కానీ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈవెంట్ పర్మిషన్ కోసం నా వద్దకు కాకుండా చంద్రబాబు వద్దకు వెళ్ళమని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ను గెస్ట్ గా అనుకున్నప్పటికీ బిజీ షెడ్యూల్ కారణంగా పవన్ కళ్యాణ్ వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారట. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.