భారతీయులు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగలలో దీపావళి పండుగ ఒకటి..ఏ పండుగకు లేని హడావుడి దీపావళి పండుగకు ఉంటుంది.. దీపావళి పండుగ అంటే చిన్న పిల్లలు ఎంతో ఇష్టపడతారు.. పండుగకు వారం రోజులు ముందే వీధిలో టపాసులు కాలుస్తూ చిన్న పిల్లలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు.. అయితే చిన్న పిల్లల దృష్టిలో దీపావళి అంటే టపాసులు కాల్చడం.. కానీ దీపావళికి అర్ధం వేరే వుంది..దీపావళి అంటే దీపాల పండుగ.. దీని అర్ధం చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా అప్పట్లో దీపాలని వెలిగించే వారు.. క్రమంగా ఆ పండుగ దీపావళిగా మారింది.. అయితే దీపావళి పండుగను తరాలు మారే కొద్ది దీపాల పండుగ గా కంటే టపాసుల పండుగగా జరుపుకుంటున్నారు. విపరీతంగా, నిర్వీరామంగా టపాసులు  కాలుస్తూ ప్రకృతిని పొల్యూట్ చేస్తున్నారు.. దీపావళి వచ్చిందంటే చాలు మూగ జీవాలు బిక్కు బిక్కుమంటూ బతుకుతాయి.. భయంకరమైన చప్పుల్లు మూగజీవాలకు భయాన్ని కలుగ చేస్తాయి.. దీనికి పరిస్కారం.. ప్రజలలో అవగాహన తేవాలి.. అసలైన దీపావళి అంటే అర్ధం చెప్పాలి..


 దీపావళి పండుగ అంటే మూగ జీవాలు భయపడేలా చేయకూడదు..అయితే దీపావళి పండుగ అంటే ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో సినిమా ఇండస్ట్రీ కూడా భాగం అవుతుంది.. సినిమా ద్వారా ప్రేక్షకులు అవగాహన పొందుతారు.. గతంలో తెరకెక్కిన ‘జనతా గ్యారజ్’ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ప్రతి ప్రేక్షకుడు ఆదర్శంగా తీసుకోవాలి.. ఆ సినిమాలో ఎన్టీఆర్ ప్రకృతి ప్రేమికుడిగా అద్భుతంగా నటించాడు.. ప్రకృతికి నష్టం జరిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తప్పు అని చెప్పే మనస్తత్వం వున్న పాత్రలో ఎన్టీఆర్ జీవించాడు..ఆ సినిమాలో దర్శకుడు కొరటాల శివ దీపావళి పండుగపై కూడా అద్భుతమైన డైలాగ్స్ చెప్పించాడు.. దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్.. నాట్ ఏ ఫెస్టివల్ ఆఫ్ పొల్యూషన్ అనే డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి.. ఇప్పటికీ ఆ సినిమా ఈ డైలాగ్స్ ఎంతో పాపులర్.. పండుగ రోజు ప్రతి వాట్సాప్ స్టేటస్ లో ఈ డైలాగ్స్ వినిపిస్తాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: