- దీపావళి వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఈపాటే ..
- వెంకటేష్ మీనా కెరియర్ లోనే ఎవర్గ్రీన్ మ్యూజికల్ హిట్..
ప్రస్తుత కాలంలో సినిమాలు థియేటర్లో చూసే అంతవరకు మాత్రమే గుర్తుంటున్నాయి. ఎక్కువ విజువల్ ఎఫెక్ట్ పెట్టి అసలు సినిమా అనే పదాన్ని అందులో నుంచి లాగేస్తున్నారు. సినిమా థియేటర్ కు వచ్చి వారం రోజులు ఆడిందంటే అదే ఎక్కువ.. కానీ గత కొన్ని ఏళ్ల ముందు సినిమా వచ్చిందంటే మ్యూజికల్ గా కానీ కథపరంగా కానీ కుటుంబాలకు ఎంతో కనెక్ట్ అయి ఉండేది. సినిమా చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యేవారు. ఎన్నో చిత్రాలు ఇండస్ట్రీలో వచ్చాయి. అలా ఎవరి గ్రీన్ చిత్రాలలో వెంకటేష్,మీనా నటించిన సూర్యవంశం సినిమా కూడా ఒకటి. ఒక కుటుంబానికి సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తీశారు. ఇందులో వెంకటేష్ డబుల్ యాక్షన్ లో చేస్తారు. అద్భుతమైన కథాంశంతో తెరికెక్కిన ఈ మూవీ మ్యూజికల్ గా కూడా హిట్ అయింది. ఇప్పటికీ ఈ చిత్రం వచ్చి 26 ఏళ్ల అయినా దీపావళి వచ్చిందంటే తప్పనిసరిగా ఈ మూవీ టీవీల్లో ప్రసారం చేస్తారు. మరి ఈ మూవీ ఎప్పుడు వచ్చింది ఆ వివరాలు చూద్దాం..
రీమేక్ స్పెషలిస్ట్ భీమనేని శ్రీనివాసరావు అంటే అప్పట్లో తెలియని వారు ఉండరు. ఈయన 1998లో తమిళ్ నుంచి సూర్యవంశం మూవీ ని రీమేక్ చేశారు. ఈ చిత్రం 1998 ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ అయింది. అలాంటి ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ దిపాత్రాభినయం చేశారు. ఇందులో తండ్రి పాత్రకు గాను రాధిక హీరోయిన్ గా చేస్తే కొడుకు పాత్రకు గాను మీనా హీరోయిన్గా చేసింది. వీళ్లే కాకుండా సంఘవి,ఆనంద్ రాజ్,మాస్టర్ ఆనంద్ కూడా నటించారు. ఇక ఈ సినిమా కథపరంగానే కాకుండా మ్యూజికల్ గా భారీ హిట్ అయింది. తమిళ్ వెర్షన్ కి సంగీతం అందించిన ఎస్ఏ రాజ్ కుమార్ తెలుగులో కూడా మ్యూజిక్ అందించాడు. ఇక సినిమా కథపరంగా ఎమోషన్స్ పాటలపరంగా ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. ఇందులో భారీ హీట్ అయినటువంటి సాంగ్ చుక్కలన్నీ ముగ్గులై అనే పాట. దీపావళి పండుగ సందర్భంగా సాగే ఈ పాట గత 26 సంవత్సరాల నుంచి ప్రతి దీపావళికి ఈ పాట ప్రతి ఇంట్లో మోగుతుంది. అలా దీపావళి పండుగ సందర్భంగా ఎవర్ గ్రీన్ పాటగా నిలిచింది అని చెప్పవచ్చు.