భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా చెప్పుకునేవాటిలో భారతీయ పండుగలు ఒకటి. పండగలన్నింటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి ఈ పండగ ఆధ్యాత్మిక "చీకటిపై కాంతి విజయం, చెడుపై మంచి మరియు అజ్ఞానంపై జ్ఞానం"ని సూచిస్తుంది. దీపావళిని హిందూ చాంద్రమాన మాసాలైన అశ్విన్ మరియు కార్తీక - దాదాపు సెప్టెంబర్ మధ్య మరియు నవంబర్ మధ్య కాలంలో జరుపుకుంటారు .

విక్టరీ వెంకటేష్ నటించిన పెళ్ళి చేసుకుందాం చిత్రం 1997 అక్టోబరు 9న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.గీత చిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై సి. వెంకట రాజు, జి. శివరాజు నిర్మాణ సారథ్యంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్, సౌందర్య, లైలా అలాగే కామెడీ క్యారెక్టర్లు చేసిన బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుధాకర్, కళ్లు చిదంబరం తమ తమ శైలిలో హాస్యం పండించారు.మరి ముఖ్యంగా బ్రహ్మానందం పండగలు చేయాల్సిన టైంలో చేయకుండా ఇష్టం వచ్చినప్పుడు చేస్తూ ఆ కాలనీ వాసులతో రివర్స్లో మాట్లాడటం అనేది కడుపుబ్బా హాస్యాన్ని పండించింది. అయితే ఒకానొక టైంలో 'దీపావళి' అంటూ ఫిబ్రవరిలో టపాసులు కాల్చడం దాన్ని చుసిన ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఏందయ్యా ఇపుడు దీపావళి ఏంటి ఏది ఫిబ్రవరి నెల, దీపావళి అనేది అక్టోబర్ లో చేసుకుంటారు అని అన్నప్పుడు... ఏ దీపావళి అక్టోబర్ లోనే చేసుకోవాలా? ఫిబ్రవరిలో చేసుకోకూడదా? నా ఇష్టం నాకెప్పుడూ చేసుకోవాలి అనిపిస్తే అపుడే చేస్కుంటా అంటూ  బ్రహ్మానందం అనడం దాంతో వారందరు ఆశ్చర్యనికి గురవ్వడం అనే సీన్ సినిమాలో దీపావళి యొక్క ప్రముఖ్యత గూర్చి చెప్పడం అదొక సరదాగా ఫన్నీగా సాగుతుంది. అయితే ఆ సీన్ కు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు లభించాయి.

సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన శివాజీ ది బాస్ చిత్రం 2007లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. AVM ప్రొడక్షన్స్ నిర్వహణలో శంకర్ డైరెక్షన్ వచ్చిన ఈ చిత్రంలో రజిని కాంత్,శ్రియ,వివేక్ మరియు సుమన్‌ తదితరులు నటించారు. అయితే ఈ సినిమాలో మొదటి సగంలో రజినీకాంత్ శ్రేయను ప్రేమించి తన ప్రేమను ఆమెకు చెప్పే ప్రయత్నంలో హీరో చేసే పనులు మంచి హాస్యాన్ని పండిస్తాయి. దాంట్లో భాగంగానే శ్రేయ వాళ్ళ ఇంటికి వెళ్లడం అక్కడ ఆమెచేత తిరస్కరించబడటం మళ్ళా మళ్ళా వెళ్లడం అదే ప్రతిసారి జరగటం దానికి శ్రేయ వాళ్ళ నాన్న పరిచయం లేని వాళ్ళకి నా కూతుర్ని ఇవ్వడం కుదరదు అన్నప్పడు రజనీకాంత పరిచయం పెంచుకుందాం అంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ను హీరోయిన్ వాళ్ళ ఇంటికి తీసుకురావడం అప్పుడు కూడా వాళ్ళు కాదంటే అక్కడ నల్లగా ఉన్నటువంటి అక్కమ్మ, జక్కమ్మ అనే ట్విన్స్ వాళ్ళ ఫ్యామిలీకి హీరో వాళ్ళ ఫ్యామిలీకి మధ్య జరిగిన సరదా సన్నివేశాలు బాగా ఫన్నీగా ఆకట్టుకుంటాయి.అలాంటి వారి మధ్య 'దీపావళి' సెలెబ్రేషన్స్ అనేది చేసుకోవడం సరదాగా సాగె సన్నివేశం.ఈవిధంగా 'దీపావళి' ప్రత్యేక అనేది సినిమాల్లో వివిధ రూపల్లో చూపిస్తూ పండగ యొక్క ఇంపార్టెన్స్ ను దర్శకులు చూపడానికి ట్రై చేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: