సౌతిండియా హీరోయిన్ స్టార్‌ నయనతార... గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆనతి కాలంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది నయనతార. 2003లో మలయాళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది అతితక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో అగ్ర కథనాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2003లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నయనతార... తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుసగా సినిమాల్లో నటిస్తూ అగ్ర హీరోయిన్గా నటించింది.


ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ లేడీ సూపర్ స్టార్ గా నటిస్తోంది. సినిమాల పరంగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతార విగ్నేష్ శివన్ ను ప్రేమించి 2022లో వివాహం చేసుకుంది. ఇక నయనతారపై "బియాండ్ ది ఫేయిరీ టైల్" పేరుతో స్పెషల్ ఎపిసోడ్ విడుదల అవుతుంది. నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నయనతార తన కథని చెప్పబోతున్నారు. అయితే ఈ కథని ఎంతవరకు చెప్పనున్నారు అనేది తెలియాల్సి ఉంది.


ఇందులో నయనతార తన విషయాలను అన్ని ఓపెన్ గా చెబుతున్నారా? లేక కొంతవరకు మాత్రమే పరిమితం చేస్తున్నారా? అనేది వేచి చూడాలి. నయనతార ఇండస్ట్రీలో ఎలా ఎదిగింది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. చిన్న పాత్రతో నటిగా పరిచయమైన నయనతార... ప్రస్తుతం ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. నయనతార జీవితంలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.


తన భర్త విగ్నేష్ శివన్ కన్నా ముందే పలువురు నటులతో ప్రేమాయణాలు కొనసాగించినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. మరి ఆ విషయాలను కూడా ఈ స్టోరీలో చెబుతున్నారా లేదా అనేది కొంతమంది చర్చించుకుంటున్నారు. ఇక ఈ ఎపిసోడ్ కోసం చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా... గతంలోనే.. శింబూ, ప్రభు దేవా లాంటి వారితో  నయనతార ఎఫైర్‌ పెట్టుకుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: