ఈ విషయం బహుశా మీరు ఉహించి ఉండరు! కానీ ఇది నిజం. వెండితెరపై కొందరు హీరో హీరోయిన్లు రొమాన్స్ చేస్తే చూడముచ్చటగా ఉంటుంది. వారు బయట కూడా భార్యాభర్తలు అన్న అనుమానం కలగక మానదు. అలా వారు ఆయా పాత్రలలో జీవించి ఫ్యాన్స్ కిక్కు ఇస్తూ ఉంటారు. ఇక నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో చాలా మంది స్టార్ హీరోయిన్లతో నటించారు, ఇంకా నటిస్తూనే ఉన్నారు. బాలయ్యతో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్లలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒకరు. విజయశాంతి - బాలయ్య కాంబో గురించి ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ, విజయశాంతి దాదాపు 17 చిత్రాల్లో నటించిన సంగతి మీకు తెలుసా? సిల్వర్ స్క్రీన్ పై వాళ్ళది సూపర్ హిట్ పెయిర్ అని అనేవారు.

ముద్దుల మావయ్య, రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వీరి కాంబోలో వచ్చినవే. ఇక విజయశాంతి, బాలకృష్ణ తొలిసారి 1984లో కథానాయకుడు అనే చిత్రంలో నటించడంలో జరిగింది. ఆ తర్వాత కాలంలో 17 చిత్రాలలో వీరు నటించి అందమైన జంటగా పేరు గడించారు. ఈ నేపథ్యంలోనే వీరు అమరప్రేమికులుగా మారారని, పెళ్లి కూడా చేసుకుంటారని అప్పట్లో పుకార్లు షికార్లు చేసేవి. అయితే వారి పెళ్ళికి ఓ పెద్దమనిషి అడ్డుపడడంతో పెళ్లి ఆగిపోయిందని కూడా చెప్పుకుంటారు. అయితే, ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే, షాక్ అవుతారు. అవును, ఆఖరికి నటి విజయశాంతి బాలయ్యకు రాఖీ కట్టి 'అన్న' అనేసింది మరి!

అసలు విషయంలోకి వెళితే, 1987లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య, విజయశాంతి "భానుమతి గారి మొగుడు" చిత్రం షూటింగ్ సమయంలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. సరిగ్గా అప్పుడే రాఖీ పండగ రాగా విజయశాంతి రాఖీలు తెప్పించి బాలయ్యకి కట్టి సర్ప్రైజ్ చేసిందట. ఈ విషయాన్ని విజయశాంతి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పకురావడం కొసమెరుపు. ఆశ్చర్యం ఏంటంటే, ఆ చిత్రంలో విజయశాంతి బాలయ్యకి భార్యగా నటిస్తోంది. ఒక వైపు భార్యగా నటిస్తూ ఆఫ్ స్క్రీన్ లో చెల్లెలు లాగా రాఖీ కట్టడంతో సినిమా యూనిట్ అందరికీ షాక్ తప్పలేదు మరి. "బాలయ్య నేను ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ, ఆయన నాకు ఒక బ్రదర్ లాంటివారు. రియల్ లైఫ్ లో పర్సనల్ విషయాలని కూడా మేమిద్దరం అన్నా చెల్లెళ్ళ లాగా షేర్ చేసుకుంటాం." అని ఆ సందర్భంగా ఆమె చెప్పుకురావడం విశేషం!

మరింత సమాచారం తెలుసుకోండి: