తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఆరంభం అదిరిపోయినా, కొనసాగింపు మాత్రం అంత మజా ఇవ్వడం లేదని ప్రేక్షకులు పెదవి విరిచేస్తున్నారు. దానికి కారణం, బిగ్ బాస్ టాస్కులా.. లేదంటే కంటెస్టెంటుల ప్రవర్తనా అంటే, ఖచ్చితంగా కంటెస్టెంటుల ప్రవర్తన అని చెప్పుకోక తప్పదు. ఇక ఈ సీజన్లో టాస్కుల విషయంలో చాలా అగ్రెసివ్ గా ప్రవర్తించే కంటెస్టెంట్ పేరు చెప్పమంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చే పేరు పృథ్వీ. మనోడు ఆడవాళ్ళు, మగవాళ్ళు అని తేడా లేకుండా చాలా క్రూరంగా టాస్కులు ఆడేవాడు. అందువల్ల చాలా దెబ్బలు తగిలించుకున్నాడు కూడా. ఈ విషయంలోనే నాగార్జున దీనిపై ఒకసారి సీరియస్ అయ్యి, ఇంకోసారి ఆటలు ఆడేటప్పుడు ఆ కోపాన్ని తగ్గించుకోకపోతే ‘రెడ్ కార్డు’ ఇస్తా! అని వార్నింగ్ ఇచ్చాడు.

ఇక అప్పటి నుండి పృథ్వీలో కాస్త మార్పు వచ్చింది. ఆ మార్పుని చూసిన నాగార్జున మెచ్చుకున్నాడు కూడా. కానీ నిన్న నిఖిల్ ఆడినంత అగ్రెసివ్ గా అయితే పృథ్వీ ఎప్పుడూ ఆడలేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిల పట్ల ఘోరంగా ప్రవర్తించిన ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ హిస్టరీలోనే ఎవ్వరూ చేయనంతగా అతి చేసాడని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. నిఖిల్ నిన్న యష్మీ, ప్రేరణతో ఆడిన తీరుని పోలీసులు చూస్తే, ఇతని పై కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేయొచ్చు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి అంటే మీరు అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆపేయ్ అని హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ నిఖిల్ తో చెప్పినా నిఖిల్ ఆపడు. వేరే వాళ్ళ మీద కోపాన్ని యష్మీ, ప్రేరణ మీద చూపించి, అత్యంత కిరాతకంగా, సైకో లాగా ప్రవర్తించాడు అని చెప్పుకోవచ్చు.

ఈ క్రమంలోనే ఇతని ప్రవర్తనపై వీకెండ్లో నాగార్జున సీరియస్ అవ్వడానికి చాన్సు ఉందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా నిఖిల్ కి రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మూడవ వారంలో అభయ్ బిగ్ బాస్ ని తిట్టాడని, రెడ్ కార్డు చూపించి బయటకి వెళ్ళిపోమని చెప్పాడు నాగార్జున. అయితే ఇపుడు అభయ్ చేసిన దానికి వంద రెట్లు ఎక్కువ తప్పు చేసాడు నిఖిల్. అమ్మాయిలతో నీచంగా ప్రవర్తించడమే కాకుండా, గౌతమ్ పై చేయిచేసుకున్నాడు. మధ్యలో అవినాష్ ఇతన్ని ఆపకపోయ్యుంటే కచ్చితంగా నిఖిల్, గౌతమ్ ని కొట్టేవాడు. వీటి అన్నిటికి నాగార్జున నిఖిల్ కి రెడ్ కార్డు వార్నింగ్ ఇవ్వాలి అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ బలమైన డిమాండ్ చేస్తున్నారు. మరి నాగార్జున దీనిపై ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: