అతిలోక సుందరి శ్రీదేవి తర్వాత అంతటి అందం ఆమె సొంతం. 14 సంవత్సరాల వయసులోనే సినీ అవకాశాలు రాగ, 16 సంవత్సరాల వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దివ్య భారతి. ఓం ప్రకాశ్ భారతి, మిఠా భారతి దంపతులకు ముంబైలో 1974 ఫిబ్రవరి 25వ తేదీన దివ్యభారతి జన్మించింది. దివ్యభారతికి హిందీ, ఇంగ్లీష్, మరాఠీ భాషలు స్పష్టంగా వచ్చు. తన సినీ కెరీర్ ని త‌న 16వ ఏట మొదలుపెట్టి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్న రోజుల్లో కేవలం తనకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే దురదృష్టవశాత్తు మరణించింది.


ఇక దివ్వ‌భార‌తి మ‌ర‌ణికి ముందు ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్‌ను ప్రేమించి పెద్దలను ఒప్పించలేక 1992 మే 10న రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన ఏడాదికే ఆమె ముంబైలోని తన బిల్డింగ్ పై నుంచి జారి కిందపడిపోయి చనిపోయింది. ఆమెను తన భర్తే తోసేశాడని ఆరోపణలు వచ్చాయి. కానీ సరైన ఆధారాలు లేకపోయేసరికి అది ఒక రూమర్ గానే మిగిలిపోయింది. ఇప్పటికీ ఆమె మరణం మిస్టరీగానే మిగిలిపోయింది.  అయితే దివ్య భారతి మరణం అనంతరం సాజిద్ ఎన్నో అవమానాలను ఎదుర్కోన్నారట. అప్పటి నుంచి దివ్య భారతి తండ్రితోపాటు కలిసి ఉన్న తర్వాత 2000 వ సంవత్సరంలో వార్దా ఖాన్ ను వివాహం చేసుకున్నారు షాజిద్ .


ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇక దివ్య భారతి చనిపోక ముందు ఆమె బాలీవుడ్ లో 11 సినిమాలకు బుక్ అయ్యింది, ఆమె చనిపోయిన తర్వాత ఈ సినిమాలను శ్రీదేవి , కాజోల్ , జూహీ చావ్లా , టబు , పూజ భట్, కరిష్మా కపూర్ వంటి వారు పూర్తి చేసారు. ఏది ఏమైనా దివ్య భారతి మరణం చిత్ర పరిశ్రమ అంత త్వరగా మర్చిపోలేకపోయింది.ఇక ఆమె భర్త షాజిద్ కూడా తన భార్య ప్రేమ కోసం ఎంతో పరితపించి.. ఒంటరివాడైన ఆయన తర్వాత ఆ బాధ నుంచి బ‌య‌ట‌కురావ‌డానికి చాలా సమయం పట్టిందిని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: