టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ..ఎంతమంది యంగ్ హీరోస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న కూడా కొంతమంది హీరోలు నటన చాలా చాలా అద్భుతంగా ఉంటుంది . ఎన్నిసార్లు చూసినా సరే ఆ నటన మర్చిపోలేం.  ఆ నటన తనివి తీరదు.  అలాంటి నటనను కనుబరుస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం నటన ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  నాచురల్ యాక్టింగ్ ..సీన్స్ ని సీన్స్ గా కాకుండా నిజజీవితంగా ఆయన నటిస్తూ ఉంటాడు . ఆయన తాజాగా నటించిన సినిమా "క".


 ఈ సినిమాను సుజిత్ అండ్ సందీప్ దర్శకులుగా వ్యవహరించి తెరకెక్కించారు . ఈ సినిమా దీపావళి కానుకగా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే సినిమా టాక్ మాత్రం కిరణ్ అబ్బవరం అనుకున్న రేంజ్ లో రాలేకపోయింది . సినిమాను చూసిన ఆడియన్స్ సినిమాలో ఉన్న నెగటివ్స్ ను ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . మరి ముఖ్యంగా కిరణ్ అబ్బవరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యా
ఖ్యలు సినిమాపై భారీ హైప్ పెంచాయి . అయితే సినిమా చూసిన తర్వాత మాత్రం సినిమాకి అంత సీన్ లేదు అంటూ తేల్చేస్తున్నారు జనాలు .


కిరణ్ అబ్బవరం ఒక అనాధగా పెరుగుతూ ఉంటాడు.  అతనికి చిన్నప్పటి నుంచి పక్క వాళ్ళ లెటర్స్ చదవడం అంటే ఇష్టంగా ఉంటుంది. అది ఒక హాబీగా మార్చేసుకుంటాడు . ఎలా అంటే దొంగ చాటుగా ఉత్తరాలను చదువుతూ కూడా ఉంటాడు.  ఇలాంటి క్రమంలోనే దొంగ చాటుగా ఉత్తరాలు చదువుతున్న మూమెంట్లో మాస్టర్ ఇంట్లో ఉత్తరం చదువుతున్నప్పుడు ఆయన కు దొరికిపోతాడు . దీంతో ఆయన చివాట్లు పెట్టడంతో వేరే ఊరికి పారిపోతాడు . అక్కడ ఏదో చేతికి వచ్చిన పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు.  కానీ ఆ పక్క వాళ్ళ ఉత్తరాలు చదివే అలవాటు మాత్రం మానుకోలేడు . ఈ క్రమంలోని ఆయన ఒక ఊరికి షిఫ్ట్ అవ్వగ.. అక్కడ టెంపరరీ పోస్ట్ మ్యాన్  జాబ్ ను సంపాదించుకుంటాడు .



హైలెట్ ఏంటంటే ఆ ఊరిలో మూడు గంటలకే చీకటి పడిపోతూ ఉంటుంది . అంతేకాదు ఆ ఊరిలో తెల్లవారుజామున 5:00 కి అమ్మాయిలు కిడ్నాప్ జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోని అసలు కిరణ్ అబ్బవరం ఫేస్ చేసి సిచువేషన్ ఏంటి ..? ఆ కిడ్నాప్ లు చేస్తుంది ఎవరు? అసలు "క" అంటే ఏంటి..?  కిరణ్ అబ్బవరం ఫైనల్ గా ఏం చేశాడు ..? కిడ్నాప్ చేస్తున్న వాళ్ళని అసలు ఎలా ఆయన పట్టుకోగలిగాడు ..?అన్నది అసలు సినిమా.

అయితే ఇలాంటి సీన్స్ ఎన్నెన్నో  ఇదివరకే సినిమాల్లో చూసాం. మరి ముఖ్యంగా కాంతార బ్యాక్ గ్రౌండ్ లాగే ఈ సినిమాను తెరకెక్కించడం మైనస్ గా మారింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు కాంతారా గుర్తొస్తుంది . కానీ కిరణ్ అబ్బవరం ఎక్కడ గుర్తు రాడు . అంతేకాకుండా కిరణ్ అబ్బవరం సినిమా గురించి ఇచ్చిన  హైప్ మరీ ఓవర్గా ఉంది అని..ఆ హైప్స్ తో సినిమా థియేటర్స్ కి వెళ్తే కచ్చితంగా బొక్క బోర్లా పడాల్సిందే అంటున్నారు జనాలు . చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో.. ?

మరింత సమాచారం తెలుసుకోండి: