చిన్న వయసు నుంచి ఆరుపదుల వయసులోనూ తన హవాను కొనసాగిస్తు కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నాడు. తాజాగా నాగార్జున తన సినీ కెరీర్ లో మొదటిసారిగా విలన్ పాత్రను పోషించనున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ "కూలి" సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో ఉన్న స్పెషల్ ఏంటంటే....నట సామ్రాట్ నాగార్జున విలన్ గా కనిపించనున్నాడు.
ఈ సినిమాలో నాగార్జున విలన్ కాబట్టి.... రజనీకాంత్, నాగార్జున మధ్య గట్టి పోటీ ఉండబోతున్నట్లు లోకేష్ కనగరాజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సినిమా మీద లోకేష్ భారీగా కసరత్తులు చేస్తున్నాడు. కావాలనే ఏరి కోరి ఈ సినిమాలో నాగార్జునను విలన్ పాత్రలో ఎంపిక చేశారట. అతని చేత కొత్తరకం విలనిజాన్ని పండించడానికి ఈ ప్రయత్నాన్ని చేస్తున్నారట. తాజాగా రజనీకాంత్, నాగార్జున మధ్య క్లైమాక్స్ ఫైట్ తీశారు.
అందులో భాగంగానే రజిని నాగార్జునను కొట్టడం జరుగుతుంది. తమిళ మీడియాలో నాగార్జునను కోట్టిన రజనీకాంత్ అంటూ భారీగా వార్తలు వచ్చాయి. రజనీకాంత్ చేతిలో నాగార్జున దెబ్బలు తిన్నాడు అంటే అది కేవలం కథలో భాగం మాత్రమే అని వెల్లడయింది. ఇక ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉండగా...టాలీవుడ్ కింగ్ నాగా ర్జున ఈ మధ్య లో పెద్దగా సినిమాలు చేయలేదు. అటు సూపర్ స్టార్ రజినీ కాంత్ మాత్రం వెట్టియాన్ అనే సినిమాతో మెరిసాడు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.