రేణుకాస్వామి (33) హత్య కేసులో నిందితుడైన కన్నడ సూపర్ స్టార్ దర్శన్ తుగుదీపకు తాజాగా కర్ణాటక హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు వెన్నుముక శస్త్రచికిత్స చేయించుకోవడానికి బెయిల్ అవసరమని కోరారు. కోర్టు ఆయనకు ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది, కానీ కొన్ని నిబంధనలు విధించింది. ఈ విషయంపై రేణుకాస్వామి తండ్రి కాశీనాథ్ శివనగౌడ స్పందించారు. ఆయన ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడారు. కన్నీళ్లు దిగ మింగుకొని మరీ ఆయన మీడియా ముందు మాట్లాడారు. న్యాయ వ్యవస్థపై తనకు గట్టి నమ్మకం ఉందని, న్యాయం తప్పక జరుగుతుందని అన్నారు. కోర్టు నిర్ణయంపై ఆయన స్పందించకపోయినా, దర్శన్ తన చేసిన తప్పుకు తప్పక శిక్ష అనుభవించాలని ఆయన నమ్ముతున్నారు.

"న్యాయ వ్యవస్థ ప్రకారం బెయిల్ మంజూరు చేశారు. దానిపై మనం ఏమీ అనలేము. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడుతుందనే నమ్మకం నాకు ఉంది. న్యాయం, పోలీసులపై మనకు నమ్మకం ఉంది" అని కాశీనాథ్ అన్నారు. చికిత్స అనేది డాక్టర్లు, కోర్టు విషయం, దాని గురించి తాను మాట్లాడనని ఆయన తెలిపారు. ఆయన మాటలు విన్న తర్వాత చాలామంది నెటిజన్లు అయ్యో పాపం అని అంటున్నారు. మర్డరర్లు ఏదో ఒక నెపంతో బయటికి వచ్చేస్తున్నారు అని కామెంట్లు చేస్తున్నారు. బాధితులకు న్యాయం జరక్కపోతే వారు ఎంతో మానసిక వేదనకు లోనవుతారని పేర్కొంటున్నారు. ఇదిగో చిన్న కొడుకు కళ్ళ ముందే చనిపోవడం అయినా భారతీయ న్యాయవ్యవస్థ ఏమి ఇప్పటికీ చేయకపోవడం ఎంతో కలిసి వస్తుందని అంటున్నారు.

కన్నడ సినిమా నటుడు దర్శన్ తుగుదీప తన అభిమాని రేణుకాస్వామిని హింసించి చంపారనే ఆరోపణలపై జైలులో ఉన్నారు. దర్శన్ తన స్నేహితులతో కలిసి రేణుకాస్వామిని బెంగళూరు వెలుపల ఒక షెడ్‌లో ఉంచి కొరడా దెబ్బలు కొట్టారు. ఈ ఘటనలో రేణుకాస్వామి చనిపోయాడు. దర్శన్‌కు ప్రియమైన నటి పవిత్ర గౌడకు అసభ్యకర సందేశాలు పంపినందుకే రేణుకాస్వామిని హింసించారని పోలీసులు అనుమానిస్తున్నారు. రేణుకాస్వామి తండ్రి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా చేసుకుంటారని, త్వరగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇకపోతే దర్శన్‌ను 2024, జూన్ 11న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. ఆయనకు రెండుసార్లు బెయిల్ నిరాకరించబడింది. కానీ తాజాగా, ఆరోగ్య సమస్యల కారణంగా ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేశారు. ఆయనకు శస్త్రచికిత్స చేయించుకోవడానికి వైద్యులు సలహా ఇవ్వడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దర్శన్ జైలు అధికారులతో మాట్లాడుతూ, తన తప్పులను అంగీకరించాడు. జైలులో ఉండగా తాను కొన్ని అనవసరమైన కోరికలు చేశానని చెప్పి వారితో క్షమాపణ చెప్పాడు. జైలులో ఉండగా దర్శన్ టీవీ, కుర్చీ కోసం అడిగినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, ఆయన జైలులో ఇతర ఖైదీలతో మాట్లాడుతూ, గ్యాంగ్ సభ్యులతో సమయం గడుపుతూ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: