మలయాళీ నటూడు అయినా తెలుగులో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు దుల్కర్ సల్మాన్ . మరీ ముఖ్యంగా మహానటి , సీతారామం సినిమాలు ఆయనకు ప్లస్ గా మారాయి . ఈ క్రమంలోనే లక్కీ భాస్కర్ సినిమాను యాక్సెప్ట్ చేశాడు . అంతేకాదు ఈ సినిమా మొత్తానికి కూడా ఆయనే కర్త - కర్మ - క్రియగా ఉండడం గమనార్హం. స్టోరీ మొత్తం ముంబైలోని ఒక చిన్న సిటీలో ప్రారంభమవుతుంది. అంతేకాదు 1989 నుంచి 92 మధ్య జరిగిన కథ ఈ లక్కీ భాస్కర్ సినిమా . దుల్కర్ సల్మాన్ మగధ బ్యాంకులో క్యాషియర్‌గా వ్యవహరిస్తూ ఉంటాడు. అప్పులే తప్ప ఆదాయం ఉండదు. ప్రమోషన్ వస్తే కష్టాలు తీరుతాయని ఆశ పడిపోతూ ఉంటాడు . .
ఈ క్రమంలోనే బ్యాంకులో జరిగే స్కామ్ ల గురించి బయటపడుతుంది . అంతేకాదు ఈ సినిమా 1992లో ముంబైలో జరిగిన హర్షద్ మహత స్కామ్ గురించి తెరకెక్కించినట్లు ఉంది. ఈ స్కాం గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది . దీనిపై గతంలో పలు వెబ్ సిరీస్ కూడా వచ్చాయి . హర్షద్ మహత్తని బ్యాంకులో పనిచేసే సాధారణ ఎంప్లాయ్ ఎలా బురిడి కొట్టించాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. బ్యాంక్ లో జరిగే మోసాలు ఎప్పటికప్పుడు చిన్న చిన్న స్కాములు ఎలా ఉంటాయి అనే విషయాన్ని డైరెక్టర్ కళ్లకి కట్టిన్నట్లు చూపించాడు. అయితే ఈ సినిమా మొత్తం కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది . అసలు కథ ఈ సినిమాకి మెయిన్ ప్లస్. లక్కీ భాస్కర్ లాంటి కథ గతంలో చాలానే చూసినా.. డైరెక్టర్ మాత్రం ఈ కథను మరింత సరికొత్తగా తెరకెక్కించాడు. లక్కీ భాస్కర్ చూస్తున్నంత సేపు మనకు అదే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది . సిబిఐ వాళ్ళు లక్కీ భాస్కర్ అని అదుపులోకి తీసుకొని బ్యాంకుకు తీసుకువెళ్లి మరి విచారణ ప్రారంభించడంతో అసలు సినిమా ప్రారంభమవుతుంది . సినిమాలో మీనాక్షి చౌదరి క్యారెక్టర్ కూడా హైలెట్‌గా మారింది . ఇప్పటివరకు దుల్కర్ సల్మాన్ అంటే మహానటి , సీతారామం సినిమాలు మాత్రమే అనుకున్నాము కానీ ఇప్పుడు మాత్రం దుల్కర్ అనగానే ముందు అందరికీ గుర్తొచ్చేది లక్కీ భాస్కర్ సినిమా . అంతలా డైరెక్టర్ చాలా ఎక్స్‌క్లూజివ్ గా సీన్స్ తెరకెక్కించారు. ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో సందేహమే లేదు .
లక్కీ భాస్కర్ సినిమాకి కధే మెయిన్ లక్కి గా మారింది . ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చినా కూడా ఈ సినిమాలో ఏదో స్పెషల్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. అలా సినిమాని హైలెట్ గా మార్చేసాడు డైరెక్టర్..!