ఇక ఆ సంగతి కాస్త పక్కన పెడితే.. ఇక్కడ కనిపిస్తోన్న ఫొటోను మీరు గమనించారా? అవును, మీరు చూసింది నిజమే. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. హీరో అబ్బాస్ ఫోటోనే అది. అయితే అతని పక్కన కూర్చున్నదెవరో గుర్తు పట్టారా చూడండి? అప్పటి ఈ చిన్న పిల్లాడు ఇప్పుడు ఒక స్టార్ హరో. లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్ టైన్ లతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కూడా. అవును, ప్రస్తుతం కోలీవుడ్లో మనోడు దుమ్ములేపోతున్నాడు. ఈ నటుడు ప్రేమ విషయాలలో కూడా నిత్యం వార్తల్లో చిక్కుకుంటూ ఉంటాడు మరి! ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా?
ఈ హీరో మరెవరో కాదండీ... జర్నీ, రాజా రాణి లాంటి సినిమాలతో క్రేజీ హీరోగా మారిపోయిన జై. ఇది అతని చిన్నప్పటి ఫొటో. ఇందులో హీరో అబ్బాస్ జై భుజాలమీద చేయి పెట్టడంతో వీరి మధ్య మంచి అనుబంధం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఫొటో ఎప్పటిది.. ఏ సందర్భంలో తీశారన్నది మాత్రం మిలియన్ల డాలర్ల ప్రశ్నయే అవుతుంది. ఏదో పంక్షన్ లో నే ఈ ఫొటో క్లిక్ మనిపించినట్లు బ్యాక్ గ్రౌండ్ చూస్తే అర్థమవుతోంది. ఇక జై విషయానికొస్తే తెలుగు హీరోయిన్ అంజలి, జై ప్రేమలో ఉన్నట్లు ఆ మధ్యన ప్రచారం జరగగా, అది వట్టి పుకారే అని తేలిపోయింది. జై చివరిగా నయనతారతో కలిసి అన్నపూరణి అనే మూవీలో కనిపించాడు.