అఖండ సినిమాలో బాలయ్య రైతుగా , అగోరగా రెండు పాత్రలో కనిపించాడు.. ఇప్పుడు వచ్చే రెండో భాగంలో ఆ పాత్రలకు కొనసాగింపుగా కొంచెం కొత్తగా సినిమాను చూపించబోతున్నాడట బోయపాటి .. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్ లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పాత్రను రక్షించేందుకు బాలయ్య అమెరికాలో ఓ స్టైలిష్ లుక్ తో ఎంట్రీ ఉంటుందని చెప్తున్నారు. అలాగే స్టైలిష్ లుక్ లో బైక్ పై బాలయ్య ఎంట్రీ ఇస్తూ ఆ సీన్ లో ఫైట్లు కూడా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి భాగంలో రెండు పాత్రలో కనిపించిన బాలయ్య ఈసారి కొంచెం స్టైలిష్ గా కనిపించబోతున్నాడు.
అలాగే బాలయ్య రెండో పాత్ర ఇమేజ్ ఈసారి పూర్తిగా బోయపాటి మార్చబోతున్నాడు.. స్టైలిష్ యంగ్ లుక్ లో బాలయ్యను పరిచయం చేయాలన్నది బోయపాటి ప్లాన్ గా కనిపిస్తుంది. అలాగేహై వోల్టేజ్ యాక్షన్ తో వస్తున్న ఈ సీన్లు ఇంటెన్సిటీ ప్రేక్షకులకు తెగ నచ్చుతుందట. అలాగే ఈ సీక్వెల్‌లో కూడా ప్రగ్యా జైస్వాల్ తన మొదటి పాత్రలోనే ఉంటుందని తెలుస్తుంది .. ఇకపోతే ఈసారి కథలో మరికొన్ని కొత్త ట్విస్టులు కూడా ఉంటాయని బోయపాటి ఇప్పటికే హింట్ ఇచ్చారు. అఖండ’ భారీ సక్సెస్ అయినందున, ‘అఖండ 2’పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికా బ్యాక్‌డ్రాప్‌తో కూడిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి కొత్త హైప్ తీసుకువస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్యను సరికొత్త అవతార్‌లో చూపిస్తూ, పాన్ ఇండియా రేంజ్‌కి తీసుకెళ్లే విధంగా బోయపాటి శ్రీను ప్రణాళిక వేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే, బాలయ్య పాన్ ఇండియా రేంజ్‌లో మరింతగా ప్రజాదరణ పొందుతారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.