అయితే మహేష్ బాబు తన కెరియర్ లో ఇప్పటికి ఎన్నో సినిమాలు నటించారు. అయితే మహేష్ తన కెరియర్ మొదట్లో వరుస అపజయాలు చూశాడు. యువరాజు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ కు ఒక్కడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ దక్కింది. ఆ తర్వాత చాలా కాలం దాకా మహేష్ కు హిట్ రాలేదు. అదే సమయంలో మహేష్ తన ముద్దు పేరుతో ఓ సినిమా కూడా చేశారు .. అది కూడా ఆయనకు కలిసి రాలేదు. ఆ సినిమాను ఆయన ఎంతో ఇష్టపడి మరి చేశారట. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు నాని..
అంతేకాదు దానికి సైన్స్ అంశాలు జోడించి చేయడం విశేషం. మహేష్ బాబు ముద్దు పేరు నాని అనే విషయం తెలిసిందే. ఇంట్లో అంతా ఆయన్ని అలానే పిలుస్తారట. ఆ మధ్య ఓ సినిమా ఈవెంట్లో ఈ విషయాన్ని తెలిపారు మహేష్. అయితే తన ముద్దు పేరు `నాని`తో మహేష్ చేసిన ఈ ప్రయోగం బెడిసికొట్టింది. 2004లో విడుదలైన ఈ మూవీ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాకి ఎస్ జే సూర్య దర్శకత్వం వహించగా, ఇందులో అమిషా పటేల్ హీరోయిన్‌గా నటించింది. దేవయాని చిన్నప్పటి మహేష్ పాత్రకి తల్లిగా నటించడం విశేషం. అదే అంతేకాకుండా చిన్నపిల్లడ్గా కూడా కనిపిస్తాడు సైన్స్ ప్రయోగాల కారణంగా పెద్దగా మారిపోతాడు మదర్ సెంటిమెంట్తో ఎంతో కామెడీ రొమాంటిక్ గా ఈ మూవీ ఉంటుంది కానీ ఆడియన్స్ కి ఈ సినిమా ఎక్కలేదు.. ఆయన కెరియర్ లోనే దారుణమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది ఈ సినిమా.. తన ముద్దు పేరుతో మహేష్ చేసిన ఈ ప్రయోగం తనకి కలిసి రాలేదని ఆయన ఎప్పుడూ అనుకుంటాడు .