ఈ మధ్యకాలంలో ఇది బాగా ట్రెండ్ గా మారిపోయింది.  పెళ్లికి  ముందే కలిసి చట్టపట్టలేసుకొని తిరిగిపోతూ ఉంటారు కొంతమంది కాబోయే భార్య భర్తలు . నిశ్చితార్థం అయిపోయాక కొందరు  అలా తిరుగుతూ ఉంటే మరి కొంత మంది మాత్రం అసలు నిశ్చితార్థం కూడా కాకముందే అన్ని పనులు చేసేస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు . ఈ మద్య అలాంటివి మనం ఎన్నో చూశాం. కాగా రీసెంట్ గా శోభిత ధూళిపాళ్ల-  నాగచైతన్య లు ఏఎన్నార్ అవార్డు ఈవెంట్స్ లో ఎలా ప్రవర్తించారో చూసాం .


శోభిత ధూళిపాళ్ల  చాలా ట్రెడిషనల్ గా చీర కట్టుకొని మెరిసి పద్ధతిగల అమ్మాయి అని అందరి చేత అనిపించుకుంది. అందాల దేవ కన్యలా మెరిసి అందరి  అటెన్షన్ ని గ్రాబ్ చేసింది . కాగా పెళ్లికి ముందే అక్కినేని నాగార్జున అక్కినేని ఇంటి కోడలు హోదా శోభిత ధూళిపాళ్ళకి కట్టబెట్టడంపై చాలామంది జనాలు మండిపడ్డారు . మా సమంత విషయంలో ఈ తెగింపు ఏమైంది అంటూ ఫైర్ అవుతున్నారు.



సమంత కంటే ఆ శోభిత ధూళిపాళ్ల అంత అందగత్తేనా..? అంటూ ఘాటుగా కూడా స్పందించారు . అయితే మరొకసారి శోభిత ధూళిపాళ్లను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు జనాలు . నేడు దీపావళి . ఈ సందర్భంగా కాబోయే కొత్త కోడలితో ఇంట్లో పూజ చేయిస్తున్నాడట అక్కినేని నాగార్జున . నిజానికి మూడు ముళ్ళు పడకుండా ఇలా పూజ చేయించడం మన సాంప్రదాయం కాదు. కానీ అక్కినేని నాగార్జున మాత్రం ఎందుకో శోభిత ధూళిపాళ్లతో ముందుగానే ఇలా లక్ష్మీదేవి పూజ చేయిస్తున్నారట . అంతేకాదు లావణ్య త్రిపాఠి సైతం గతంలో పెళ్లి కాకముందే నిశ్చితార్థమైన తర్వాత వరుణ్ తేజ్ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది . పీఠల మీద కూర్చుని పూజ కూడా చేసింది. ఆ తర్వాత ఇటలీలో గ్రాండ్గా పెళ్లి చేసుకుంది . లావణ్య త్రిపాఠిలాగే శోభిత ధూళిపాళ్ల కూడా పెళ్లికి ముందే అత్తగారింట్లో స్పెషల్ పూజలు చేసేస్తుంది అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: