1960 తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం. ఒక కాలపు నిలువుటద్దం లాంటిది దీపావళి సినిమా. నందమూరి తారక రామారావు కృష్ణుడిగా, సావిత్రి సత్యభామగా నటించిన ఈ చిత్రం దాని విడుదలైన కాలంలోనే కాకుండా ఇప్పటికీ సినిమా ప్రేమికుల హృదయాలలో చెరగని ముద్ర వేసింది. దీపావళి సినిమా భారతీయ పురాణాలలోని శ్రీకృష్ణుడి జీవితం నుండి ప్రేరణ పొందినది. కృష్ణుడి బాల్యం, యౌవనం, అతని వివాహం, రాక్షస సంహారం వంటి అనేక కథాంశాలను చిత్రీకరించారు. ముఖ్యంగా, కృష్ణుడు, సత్యభామల మధ్య ఉన్న ప్రేమ అనుబంధం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ. కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ యొక్క నటన అద్వితీయమైనది. ఆయన శరీర భాష, మాటలు, భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. సత్యభామ పాత్రలో సావిత్రి అద్భుతంగా నటించారు.

ఆమె అందం, అభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి అంతేకాకుండా కృష్ణకుమారి ఇందులో రుక్మిణి గా నటించారు. భారతీయ పురాణాలను తెరపై అద్భుతంగా చిత్రీకరించడం ఈ చిత్రం యొక్క ప్రత్యేకత అని చెప్పాలి. ఎన్టీఆర్, సావిత్రి వంటి మహనీయులు ఈ చిత్రంలో నటించడం ఒక అదృష్టంగా భావిస్తారు అభిమానులు. దీపావళి సినిమా తెలుగు చరిత్రలో ఒక మైలురాయి. ఈ చిత్రం తెలుగు సినిమాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతేకాకుండా ఈ చిత్రం తరువాత వచ్చిన అనేక పౌరాణిక చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఇక స్టార్ నటుడు ఎస్వీ రంగారావు నరకాసురుడిగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అంతే కాకుండా  కాంతారావు నారదుడిగా, గుమ్మడి నాగదత్తుడుగా, ఎస్. వరలక్ష్మి నరకాసురుడి భార్యగా తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చెప్పొచ్చు.

 ఇంకా ఎందరో స్టార్ యాక్టర్స్ ఇందులో నటించి భారీ గుర్తింపును తెచ్చుకున్నారు. పౌరాణిక ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ మూవీ దీపావళి పండుగ ప్రత్యేకత చరిత్ర తెలిసేలా తెరకెక్కించారు.ఇకపోతే దీపావళి పేరుతో 2008లో మరో సినిమా వచ్చింది. ఎఎఎ క్రియేషన్స్ బ్యానర్ పై తీగల కృష్ణారెడ్డి నిర్మించిన ఈ మూవీకి హరిబాబు దర్శకత్వం వహించారు. హీరో వేణు, ఆర్తీ అగర్వాల్. మేఘా నాయర్ జంటగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక వందేమాతరం శ్రీనివాస్ చక్కని సంగీతంతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఇందులో అలీ, అనంత్, భానుచందర్, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు,కొండవలస, చలపతిరావు, బ్రహ్మాజీ తమ కామెడీ, యాక్షన్ తో ప్రేక్షకులను కాసేపు నవ్వుకునేలా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: