జాన్వి కపూర్ అనగానే ముందు మన అందరికీ గుర్తొచ్చే ముఖం "శ్రీదేవి". స్వర్గీయ అలనాటి నటి శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అమ్మ అందాన్ని అచ్చం అలాగే అందిపుచ్చుకొని తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని ట్రై చేస్తుంది ఈ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ . దేవర సినిమాతో అందరికీ హై చెప్పింది. కానీ దేవర సినిమా ఆమె అనుకున్నంత హిట్ కాలేదు . త్వరలోనే రామ్ చరణ్ తో బుచ్చిబాబు సన్న దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూట్ లో పాల్గొనబోతుంది.
అదేవిధంగా నాగచైతన్యతో ఒక సినిమా కి కమిట్ అయ్యింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇదే మూమెంట్లో జాన్వీ కపూర్ కి సంబంధించిన పలురకాల వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి . బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం జాన్వీ కపూర్ తన ఫోన్లో డార్లింగ్ అంటూ ఒక తెలుగు హీరో నెంబర్ ని సేవ్ చేసుకుందట . ఆ హీరో మరెవరో కాదు మన "ప్రభాస్". ఆరడుగుల అందగాడు. ఆ కట్ అవుట్ చూస్తుంటేనే కొరుక్కుతినేయాలనిపిస్తుంది . అలాంటిది డార్లింగ్ ఫిగర్. అలాంటి నాటి హీరో పేరు ని జాన్వి కపూర్ ఇంకెలా సేవ్ చేసుకుంటుంది. మొదటినుంచి ప్రభాస్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్న జాన్వి కపూర్ ఆయన నెంబర్ ని ఫోన్లో డార్లింగ్ అంటూ సేవ్ చేసుకుందట . జాన్వికపురే కాదు చాలామంది ప్రభాస్ నెంబర్ ని తమ ఫోన్లలో అలాంటి పేరుతోనే సేవ్ చేసుకున్నారు . మరి ముఖ్యంగా జక్కన్న - జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ లాంటి వాళ్ళు కూడా డార్లింగ్ అంటూ ప్రభాస్ నెంబర్ ని సేవ్ చేసుకున్నారు . దీంతో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!