హీరో ప్రభాస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అంత మంచి మనసు మన డార్లింగ్ హీరో ప్రభాస్ ది. ఆయన గురించి ఎంత చెప్పుకున్న తక్కువగానే ఉంటుంది. కానీ ఏం చేద్దాం తక్కువుగా చెప్పుకోవాల్సిన పరిస్ధితులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆయన పై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతున్న.. అదే విధంగా ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా సరే ..ఆయన మార్కెట్ - క్రేజ్ - రేంజ్ ఏ మాత్రం పడిపోకపోవడం గమనార్హం.


ప్రభాస్ ని హేట్ చేసే జనాల కన్నా లవ్ చేసే జనాలు ఎక్కువ.  ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్న కూడా ఆయన్ని అభిమానిస్తున్నారు అంటే ఆయన మంచితనం అనే చెప్పాలి.  ప్రభాస్ తన సినిమా హిట్టా..? ఫ్లాపా..?అని  పట్టించుకోడు. తన పని తను చేసుకోబోతూ ఉంటాడు . అంతేకాదు ప్రభాస్ ఎప్పుడు కూడా వాళ్ల ఇంటికి వచ్చిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తాడు . స్పాట్లో వెళ్లిన సరే వందమందికి కడుపునిండా భోజనం పెట్టి పంపించే గుణం ఉన్న మనిషి . మన ప్రభాస్ ఎక్కడున్నా రాజే అంటూ చాలామంది ఫ్యాన్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు.



ఇంటికి ఒక స్టార్ సెలబ్రిటీ వస్తే ఎలా ట్రీట్ చేస్తారో అదే విధంగా తన ఇంటికి తనను చూడడానికి వచ్చిన ఫ్యాన్ ని కూడా అదే విధంగా ట్రీట్ చేస్తాడు ప్రభాస్ . అలాంటి ప్రభాస్ ని చాలామంది ముద్దు ముద్దుగా డార్లింగ్ , లవర్ బాయ్అంటూ పిలుచుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ అమ్మ మాత్రం ప్రభాస్ ని కన్నయ్య అంటూ పిలుస్తుందట . ప్రభాస్ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మగారు అలాగే కన్నయ్య అంటూ పిలిచేదట . ప్రభాస్ అమ్మగారికి కృష్ణుడు అంటే చాలా చాలా ఇష్ట దైవమట. ఆ కారణంగానే ప్రభాస్ పుట్టగానే కన్నయ్య కన్నయ్య అంటూ పిలుస్తుందట. ఆశ్చర్యం ఏంటంటే పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత కూడా ప్రభాస్ తల్లి  కన్నయ్య అంటూనే ముద్దుగా పిలుస్తుందట . దీంతో ఫ్యాన్స్ ఈ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: