ఇమే పలు చిత్రాలలో కూడా నటించింది. రవీనా రవి మలయాళ డైరెక్టర్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు కన్ఫామ్ చేసింది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. తన ప్రేమను ధృవీకరిస్తున్నానని రవీనా రవి, డైరెక్టర్ దేవన్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయగా అభిమానులు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ ఫోటోలకు సైతం రవీనా రవి.. నస్వరమైన క్షణాలలో ప్రపంచంలోనే మేము శాశ్వతమైన వాటిని కనుగొన్నామంటూ మేము కలిసి మా కథను రాస్తామంటూ ఒక క్యాప్షన్ రాసుకొచ్చింది.
అయితే త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటించబోతున్నారని అభిమానులు కూడా తెలియజేస్తున్నారు. ఇక డైరెక్టర్ దేవాన్ జయకుమార్ మాత్రం మలయాళంలో వాలాట్టి చిత్రానికి దర్శకత్వం వహించారు .అయితే ఇది పూర్తిగా కుక్కలకు సంబంధించిన కథాంశం కావడం చేత ఈ చిత్రంలో కూడా ఆమె ఒక కుక్క పాత్రకి డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. అప్పుడే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి త్వరలోనే వివాహ బంధం వైపుగా అడుగులు వేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి వీరి వివాహ తేదీని కూడా త్వరలోనే తెలియజేయబోతున్నట్లు సమాచారం. ఇతర భాషలలో నుంచి డబ్బింగ్ చిత్రాలు తెలుగులోకి రావడంతో ఈమె బాగా సుపరిచితమైంది.