ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ యొక్క మొదటి భాగం అదిరిపోయే రేంజ్ విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో ఈ మూవీ కి థియేటర్ మరియు నాన్ థియేటర్ హక్కులతోనే వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలు ఈ మూవీ బృందం వారు విడుదల చేయగా వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరిగినట్లు తెలుస్తోంది. ఇక దానితో ఈ సినిమాకు మామూలు టాక్ వచ్చిన , యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమాకు కూడా భారీ లాభాలు వచ్చే అవకాశం తక్కువ అని , ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈ మూవీ ద్వారా డిస్ట్రిబ్యూటర్లకు భారీ ఎత్తున లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరి ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో ... ఈ మూవీ ఏ స్థాయి రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనుండగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: