బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న మలైకా అరోరా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఐటెం సాంగ్స్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. సినిమాలకంటే కూడా వ్యక్తిగత కారణాల వల్లే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా మరొకసారి మోసపోయానంటూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ కాస్త వైరల్ అవ్వడంతో కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి సమాజం ఎలా ఉందో..? ఎటు పోతుందో గమనించండి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి అసలేమైందో ఇప్పుడు చూద్దాం.

బాలీవుడ్లో ఐటెం సాంగ్స్ చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ దక్కించుకున్న మలైకా అరోరా.. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ ను వివాహం చేసుకుంది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కొద్ది రోజులకే వీరు విడిపోయారు. ఆ తర్వాత హీరో అర్జున్ కపూర్ తో ప్రేమాయణం మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అతడితో లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు అతడి నుంచి కూడా విడిపోయింది అని సమాచారం.  అంతేకాదు అతడే ఈమెను దూరం పెట్టినట్లు తాజాగా మలైకా పోస్ట్ చూస్తే అర్థమవుతుంది.

ఇటీవల అర్జున్ కపూర్ దీవాళీ బాష్ కి వెళ్లగా అక్కడ కొంతమంది మలైకా అరోరాతో రిలేషన్షిప్ గురించి ప్రశ్నించగా.. తాను ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నాలంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.  ఇక ఇది విన్న మలైకా అరోరా తన ఇంస్టాగ్రామ్ పోస్టులో.. మన మనసును ఒక్కసారి తాకడం వల్ల.. జీవితాంతం మన ఆత్మను తాకవచ్చు.. అంటూ తన మనసులో మాటను చెప్పుకొచ్చింది. మొత్తానికైతే వీరిద్దరూ విడిపోయారు అని ఇద్దరు కూడా తమ మాటల ద్వారా బయటపెట్టారు ఇక ఇది విన్న  అరోరా అభిమానులు ఎన్నిసార్లు ప్రేమ పేరుతో మోసపోతారు.. ప్రస్తుత ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారో ఒక్కసారి గమనించండి.. ఇకనైనా చేరుకొని కెరియర్ పైన ఫోకస్ పెట్టండి అంటూ కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: