- మానవా నువ్వు ఆ మాట మానవా..
- టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మూవీ..
- కుంభవృష్టిలో కూడా కలెక్షన్ల మోత..

జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా అంటే తెలియని వారు ఉండరు. మెగాస్టార్ చిరంజీవి అతిలోకసుందరి శ్రీదేవి జంటగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో భారీ హిట్ సాధించింది. సినిమా ఫ్లాప్ అనే స్థాయి నుంచి రికార్డుల మోత మోగించింది అని చెప్పవచ్చు. అలాంటి ఈ చిత్రం వెనుక  ఎన్నో వ్యయప్రయాసాలున్నాయి. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా

 జగదేకవీరుడు అతిలోకసుందరి:

 ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో రాష్ట్రంలో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో జనాలంతా సతమతమవుతున్నారు. కొన్ని ప్లేస్లలో హెలిక్యాప్టర్లు పెట్టి మరీ ఫుడ్ ప్యాకెట్లు అందిస్తున్న టైం అది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా  జగదేకవీరుడు అతిలోకసుందరి రిలీజ్ అయ్యి భారీ హిట్ అందుకుందంటే చిరంజీవి,శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన సినిమా క్రేజ్ ఎట్లుందో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్లలో నీళ్లలో థియేటర్లు మునిగినా కానీ సినిమా చూడడం ఆపలేదు. టెక్నాలజీనే అంతగా తెలియని ఆ రోజుల్లో  బెస్ట్ అవుట్ పుట్ తో సినిమా తీశారు. అశ్వని దత్ చిరంజీవితో ఫాంటసీ కథ చిత్రం తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఈ విషయాన్ని రాఘవేంద్రరావు కో డైరెక్టర్ అయిన శ్రీనివాసరావుతో చర్చించారు. ఇదే తరుణంలో రాఘవేంద్రరావు శ్రీనివాస్ చక్రవర్తి కలిసి  తిరుపతి వెళుతున్న సమయంలో ఈ విషయాన్ని  చర్చించారు. దేవకన్య భూమిపైకి వచ్చినప్పుడు ఆమె ఉంగరం పోతుంది.  ఆ ఉంగరం చిరంజీవికి దొరుకుతుంది అనే స్టోరీ లైన్ రాఘవేంద్రరావుకు చెప్పారు శ్రీనివాస చక్రవర్తి.  


 ఆ తర్వాత రాఘవేంద్రరావు అశ్విని దత్ కు ఫోన్ చేసి చిరంజీవితో సినిమా చేద్దాం అన్నారు. చివరికి కథను ఓ కొలిక్కి తీసుకొచ్చారు. ఇందులో విలన్ పాత్రకు అమ్రిష్ పూరిని తీసుకున్నారు. తనికెళ్ల భరణి,అల్లు రామలింగయ్య,  బ్రహ్మానందం, రామిరెడ్డి  ఇలా ఎంతోమంది స్టార్ నటులను సినిమాలో తీసుకున్నారు. ఫస్ట్ ఈ చిత్రానికి భూలోకవీరుడు టైటిల్ అనుకున్నారు. కానీ శ్రీదేవికి ఉన్న ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని  ఇద్దరికీ సెట్ అయ్యేలా జగదేకవీరుడు అతిలోకసుందరి అని టైటిల్ ఫిక్స్ చేశారు. 70 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తయింది. 9 కోట్ల బడ్జెట్ పెట్టారు. మే నెలలో సినిమా రిలీజ్ అయింది. ఇదే సమయంలో భారీ వర్షాలు ఎక్కడ చూసినా వరదలు..కనీసం ఇండ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు.  ఉంటే ఉంటుంది పోతే పోతుందని ధైర్యం చేసి సినిమా రిలీజ్ చేసినటువంటి అశ్విని దత్ సినిమా రిజల్ట్ చూసి షాక్ అయిపోయారు. మొదటి షోకు సినిమాకు ఎవరు వెళ్ళలేదు.  ఇక మెల్లిమెల్లిగా సినిమా పుంజుకొని థియేటర్లలో మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నా కానీ లెక్కచేయకుండా జనాలు కూర్చుని సినిమా చూశారు. ఇక రాను రాను ప్రింట్లు భారీగా పెరిగిపోయాయి. దాదాపు 15 కోట్ల వసూలు సాధించి రికార్డు తిరగ రాసింది అని చెప్పవచ్చు..  ఇందులో చిరంజీవి, శ్రీదేవి నటన గురించి ఒక్క మాటలో చెప్పలేం. ఎందుకంటే టెక్నాలజీ లేని సమయంలోనే రియాలిటీగా నటించి సినిమాకు ప్రధాన పిల్లర్లుగా నిలిచారు. వీరి నటనకు వందకు 150 మార్కులు వేయవచ్చు అని ఈ సినిమా చూసిన ప్రేక్షకులు రివ్యూలు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: