తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయి కలిగిన హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ ప్రారంభంలో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సింహాద్రి సినిమాతో అదిరిపోయి రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మరి ఈ సినిమా ఎలా స్టార్ట్ అయ్యింది. మొదట ఈ కథలో ఎవరిని హీరోగా అనుకున్నారు. చివరికి జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు అనే వివరాలను తెలుసుకుందాం.

ప్రముఖ కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ , బాలకృష్ణ కోసం తయారు చేశాడట. కథ మొత్తం తయారు అయ్యాక బాలకృష్ణకు దానిని వినిపించాడట. బాలకృష్ణ కథ మొత్తం విని కథ సూపర్ గా ఉంది. కాకపోతే నేను ఈ రకం స్టోరీలు ఇది వరకు చాలా చేశాను. మళ్ళీ ఇలాంటి కథ అంటే జనాలు ఇష్టపడతారా ... లేదో. ఈ కథతో సినిమా వద్దు అన్నాడట. దానితో విజయేంద్ర ప్రసాద్ కూడా ఏమీ చేయలేక దానిని పక్కన పెట్టేసాడట. ఇక ఆ కథ విజయేంద్ర ప్రసాద్ కుమారుడు ప్రముఖ దర్శకుడు రాజమౌళికి ఎంతగానో నచ్చిందట. ఇక అప్పటికే ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చేసి దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తన రెండవ సినిమా కోసం విజయేంద్ర ప్రసాద్ , బాలకృష్ణ కోసం తయారు చేసిన కథను ఆయన ఎంచుకున్నాడట. 

ఇక దానికి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అయితే బాగుంటుంది అనే నిర్ణయానికి ఆయన వచ్చాడట. ఇక అందులో భాగంగా ఆ కథను రాజమౌళి , తారక్ కి వినిపించగా అది అద్భుతంగా నచ్చడంతో సినిమా చేస్తాను అని తారక్ చెప్పాడట. ఇక సింహాద్రి అనే టైటిల్ తో రూపొందిన ఈ మూవీ విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీలోని తారక్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ మూవీ ద్వారా తారక్ క్రేజ్ అదిరిపోయే రేంజ్ లో పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: