బాలీవుడ్లో ప్రముఖ నటిగా పేరుపొందిన జాక్వలిన్ ఫెర్నాండెజ్. ముఖ్యంగా సుఖేష్ చంద్రశేఖర్ విషయంలో ఈమె డేటింగ్ చేసిందనీ గతంలో వార్తలు వినిపించాయి. అంతేకాకుండా మనీలాండరింగ్ కేసులో కూడా సుకేష్ చంద్రతో పాటు ఈమె పేరు కూడా వినిపించడంతో అందరు ఆశ్చర్యపోయారు. దీంతో సుఖేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆమెను వెంటాడుతూ ఉన్నాడు సుకేష్ చంద్ర. తరచూ అప్పుడప్పుడు జాక్వలిన్ ఫెర్నాండెజ్ కీ సంబంధించి ఉత్తరాలను రాస్తూ ఉంటారు.



అయితే ఈ ఉత్తరాలు సైతం ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంటాయి. ముఖ్యంగా ఈ హీరోయిన్ పైన మోజుతో అభిమానులకు కూడా ఖరీదైన బహుమతులు ఇస్తానంటూ సుకేష్ చంద్ర అప్పుడప్పుడు ప్రకటిస్తూ ఉంటారు. ఇప్పుడు మరొకసారి తాజాగా ఫాన్స్ కి ఒక బంపర్ ఆఫర్ ని ప్రకటించారు.జాక్వలిన్ ఫెర్నాండెజ్ కు సంబంధించి ఒక పాటను రిలీజ్ చేయగా యూట్యూబ్లో ఈ పాటలకు కామెంట్లు లైక్స్ తో తెగ వైరల్ గా చేసినటువంటి అభిమానులకు సైతం సుకేష్ చంద్ర ఏకంగా..200 -16 ఐఫోన్ ప్రోలతో పాటు..25 మహేంద్ర తార్ కార్లను కూడా బహుమతిగా ఇస్తానంటూ ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని చాలామంది నవ్వుకుంటున్నారు.


గతంలో కూడా సుకేష్ చంద్ర ,జాక్వలిన్ ఫెర్నాండెజ్ కు దగ్గరగా ఉన్నటువంటి కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ తర్వాత జైలుకు వెళ్లినప్పుడు సుకేష్ చంద్ర ఎన్నో లేఖలు కూడా రాశారు. ముఖ్యంగా ఆమెపై ఉన్న ప్రేమని ఎన్నోసార్లు తెలియజేశారు. ఇప్పుడు తాజాగా తనని రాముడుగా అనుకుంటూ జాక్వలిన్ ఫెర్నాండెజ్ ను సీతగా అభివర్ణించుకున్నారు సుకేశ్ చంద్ర.. తనకు త్వరలోనే బెయిల్ వస్తుందని అందుకే రాముడు వనవాసం నుంచి తిరిగి వచ్చినట్లే తాను కూడా జైల్లో నుంచి బయటికి వస్తున్నానంటూ ఈ లేఖలు తెలియజేశారు.. అంతేకాకుండా ప్రజలు తనని పిచ్చోడు అనుకుంటున్నారు కానీ ఈ ప్రపంచానికి నా గురించి మీ గురించి మన ప్రేమ గురించి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తామంటూ సుకేష్ చంద్ర ఒక ప్రేమ లేఖను రాశారు దీంతో ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: