సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించాడు. అందులో చాలా వరకు బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి. అందులో భాగంగానే మహేష్ బాబుకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా 'అతడు' అనే చెప్పవచ్చు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మహేష్ బాబు అంతకుముందు నటించిన సినిమాల్లో విభిన్నమైన సినిమా అతడు.

2005లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో మహేష్ బాబు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఒక్కడు సినిమాతో మాస్ హీరో అనిపించుకున్న మహేష్ బాబు ఆ తర్వాత అతడు సినిమాతో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను భారీగా పెంచుకున్నాడు. అతడు సినిమా థియేటర్లలో విడుదల కన్నా టీవీలలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సోనుసూద్ కీలకపాత్రను పోషించాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

అయితే అప్పటివరకు రచయితగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాతోనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇద్దామని అనుకున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా కథను ముందుగా పవన్ కళ్యాణ్ కి వెళ్లి చెప్పగా అతను కథ వింటూ నిద్రపోయారట. ఆ తర్వాత ఇదే కథని మహేష్ బాబుకు చెబితే అతడికి బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పారట. కానీ అప్పటికే అర్జున్, నాని సినిమాలతో బిజీగా ఉన్న మహేష్ బాబు తర్వాత సంవత్సరం ఈ సినిమా చేద్దామని చెప్పాడు.

అప్పటిలోపు ఓ సినిమా చేయండి అని త్రివిక్రమ్ కి సలహా కూడా ఇచ్చారట. అలా మహేష్ బాబు పెళ్లి తర్వాత విడుదలైన ఫస్ట్ సినిమా అతడు. మొత్తం ఈ సినిమా 205 కేంద్రాల్లో 50 రోజులు, 38 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. హైదరాబాద్లోని సుదర్శన్ 35మిమీలో 175 రోజులు ఆడింది. దాదాపుగా ఈ సినిమా 40 కోట్లను కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా విడుదలైన ఏడు సంవత్సరాల అనంతరం మాటీవీ అతడు సినిమా శాటిలైట్ రేనివల్ కోసం ఏకంగా 3.5 కోట్లను ఇచ్చింది. ఈ విషయం అప్పట్లో పెద్ద సెన్సేషన్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: