ఈ టీజర్లో మొదటి సీజన్ తరహాలోనే రెడ్ అండ్ గ్రీన్ లైట్లను కూడా చూపించారు. అలాగే గేమ్‌లో పార్టిసిపేషన్ చేసేవారు లక్ష్యంగా చేసుకొని మరి చంపుతూ ఉన్నట్లుగా చూపించారు. ఒక్కో రౌండ్ ని పూర్తి చేసుకుని ముందుకు వెళ్లేలా క్రియేట్ చేశారు.ఒకవైపు ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు డబ్బు వస్తుందని ఆశతో అందరూ కూడా గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తూ ఉండేలా కనిపించింది. అయితే స్క్విడ్ గేమ్ లో 456 మంది పోటీపడ్డారు. ఇప్పుడు.స్క్విడ్ గేమ్-2 లో కూడా అంతేమంది పోటీగా ఉన్నట్లు కనిపిస్తోంది.
అయితే ఇందులో హీరో ఈ గేమ్ ఆడటం ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఎవరు వినకుండా ముందుకు వెళ్తారు ఫైనల్ గా విలన్స్ ఆడే ఈ ప్రాణాంతకమైన గేమ్ లో ఎవరు గెలుస్తారనే విషయం చూడాలి.స్క్విడ్ గేమ్ -2 లో చాలా ఇంట్రెస్టింగ్ గా సన్నివేశాలు చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే
స్క్విడ్ గేమ్ సిరీస్ ని సిద్ధం చేయడానికి సుమారుగా 12 ఏళ్లు పట్టిందట. కానీ 12 రోజుల్లో మా కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అంటూ మొదటి సీజన్ తరహాలోనే రెండవ సీజన్ కూడా అలరిస్తుందని నమ్ముతున్నామని తెలిపారు. డిసెంబర్ 26న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.