ఇక ఈ సినిమాకి సీక్వేల్ ఉంటుందని కూడా అప్పట్లో డైరెక్టర్ కూడా చెప్పలేదు .. ఈ సినిమాలో కూడా పార్ట్ 2 కి లీడ్ వచ్చేలా ఎలాంటి సన్నివేశం కూడా పెట్టలేదు .. కానీ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సీక్వెల్స్ ట్రెండ్ ఎలా కొనసాగుతుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు ప్రతి ఒక్కరు తమ సినిమాలకు సిక్వల్ ఉందంటూ .. సినిమా చివర్లో చూపిస్తున్నారు మేకర్స్ .. ఇప్పుడు ఈ క్రేజీని గమనించే నెల్సన్ రజనీకాంత్ జైలర్ చిత్రానికి సీక్వెల్ని ప్రకటించారు. అయితే ఇక్కడే అసలు సమస్య ఒకటి వచ్చి పడింది. అసలు మ్యాటర్ లోకి వెళ్తే అల్లు అర్జున్ - నెల్సన్ కాంబినేషన్లో సినిమా ఒకటి ఖరారై చాలా కాలం అయింది .. పుష్ప 2 మూవీ పూర్తి అవ్వగానే ఈ సినిమా మొదలు కావాలి.. ఇక్కడ మరో పక్క రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కూలీ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు.
డిసెంబర్ కల్లా లోకేష్ తో రజినీకాంత్ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత రజిని నెల్సన్ తో చేయ్యబోయే సినిమా షూటింగ్లో పాల్గొనడానికి డేటులు కూడా ఇచ్చేశాడు. అయితే ఇక్కడ మరో పక్క అల్లు అర్జున్ కూడా నెల్సన్ కి జనవరిలో లేద ఫిబ్రవరి నుంచి డేట్స్ ఇవ్వబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇలా ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి ఆయన ముందు ప్రారంభిస్తారట.. అందుకనే నెల్సన్ దిలీప్ కుమార్ ముందుగా అల్లు అర్జున్ సినిమానే చేస్తాడని అంటున్నారు.. ఆ తర్వాత జైలర్ 2 షూటింగ్ కు గ్యాప్ ఇస్తాడని కోలీవుడ్ లో ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇలా అల్లు అర్జున్ కారణంగా రజనీకాంత్ కు గట్టి దెబ్బ పడింది.