ఒకప్పుడు దక్షిణాదిలో అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్లలో లయ ఒకరు. స్వయంవరం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయం అయిన లయ… ఆ తర్వాత ప్రేమించు.. మనోహరం, మనసున్న మారాజు.. నీ ప్రేమకై.. హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ, పెళ్లాంతో పనేంటి, దేవుళ్లు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ హీరోయిన్‏గా అరంగేట్రం చేయకముందే ఆమె.. అక్కినేని కుటుంబరావు నిర్మించిన భద్రం కొడుకో చిత్రంలో బాలనటిగా నటించింది. తెలుగులో సక్సెస్ ఫుల్ కెరియర్ ని కొనసాగించిన తెలుగమయ్యాలలో ఆమె ఒకరు. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది లయ.ప్రస్తుతం లయ దంపతులకు ఓ పాప, బాబు ఉన్నారు. కాగా పెళ్లి, పిల్లల తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ రీ ఎంట్రీకి రెడీ అయిపోయింది.ఈ నేపథ్యంలో తెలుగులో చివరగా బ్రహ్మలోకం టూ యమలోకం వయా భూలోకం చిత్రంలో కనిపించింది. అమెరికాకు చెందిన డాక్టర్ గణేష్ గోగుర్తిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన లయ.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్, ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని తన భర్త చెప్పలేదని.. కానీ కుటుంబానికి ప్రాముఖ్యత.. పిల్లల కారణంగా అక్కడే ఉండిపోయినట్లు లయ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తోన్న రాబిన్ హుడ్ లో కీలక పాత్ర పోషిస్తోంది లయ. అలాగే బిగ్ బాస్ ఫేమ్ నటుడు శివాజీతో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది.ఇదిలా ఉంటే దీపావళి ని పురస్కరించుకుని లయ షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ఇందులో పింక్ కలర్ శాలరీలో ఎంతో అందంగా కనిపించిందీ ముద్దుగుమ్మ.ఇదిలావుండగా వయసు పెరిగిన తరగని అందంతో ఇప్పటి కుర్రహీరోయిన్లకు సైతం పోటీనిచ్చేలా ఉంటుంది లయ. తాజాగా ఇటీవలే లయ ఆమె కూతురు రెడ్ కలర్ డ్రెస్సులో ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అక్కాచెల్లెళ్లుగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: