దర్శక ధీరుడు రాజమౌళి త్రిబుల్ ఆర్ తరువాత తన తర్వాత సినిమాను సూపర్ స్టార్ మహేష్ తో  చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఇప్పటికే మహేష్ కూడా ఈ సినిమాకు సంబంధించిన వర్కౌట్స్ లో పాల్గొంటున్నాడు. అలాగే తన లుక్ మేకోవర్ లో కూడా బిజీగా ఉన్నాడు. రాజమౌళి కూడా ఈ సినిమా కోసం ఎన్నో కసరతులు చేస్తున్నాడు. అలాగే ప‌లు స్పెషల్ క్లాసులు కూడా తీసుకుంటున్నాడు. ఇప్పటికే రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు సంబంధించిన కథను పూర్తి చేశాడు. సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని కూడా అంటున్నారు.


అలాగే ఈ సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్ టెక్నీషియన్సీని కూడా వాడబోతున్నాడు. ముఖ్యంగా అవతార్ దర్శకుడు జేమ్స్ కెమెరాన్‌ ఈ సినిమాకు హాలీవుడ్ స్థాయిలో సపోర్ట్ ఇవ్వబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో ఎవరు ఊహించని హాలీవుడ్ నటి హీరోయిన్గా నటించబోతుందట. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ను మొదలుపెట్టి 2026 ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని చిత్ర‌ యూనిట్ భావిస్తున్నట్లు కొందరు వార్తలు వైరల్ చేస్తున్నారు. అయితే  2026 ఏప్రిల్ ఈ సినిమా రిలీజ్ అయితే మహేష్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు.


 ఎందుకంటే ఆల్రెడీ మహేష్ అభిమానులు 2028 వరకు మహేష్ సినిమా చూడలేమని వారు ఫిక్స్ అయిపోయారు .. అలాంటిది వారు అనుకున్న దానికంటే ముందే సినిమా వస్తుందంటే వారి ఆనందానికి అవదులు ఉండవు . అయితే రాజమౌళి మాత్రం ఎప్పుడు రిలీజ్ డేట్ చెప్పడు కానీ ఆ డేట్ కి వస్తాడని నమ్మకాలు కూడా ఎవరికి ఇవ్వడు. ఇప్పుడు మహేష్ సినిమాను కూడా రెండు భాగాలుగా రాజమౌళి తీసుకురాబోతున్నాడు .. ఇలాంటి సమయంలో ఈ సినిమాను 2026 లో రిలీజ్ చేస్తారంటే  అది నమ్మదగ్గ వార్త కాదు అని మరికొందరు అంటున్నారు. ఇక మరి రాజమౌళి మనసులో ఏముందో తెలియాలంటే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: