అలాగే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు కిరణ్.. ఆ సమయంలో తన పర్సనల్, ప్రొఫెషనల్ లైప్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా పంచుకున్నాడు. ఇక వాటిలో భాగంగా తన భార్య రసహ్య గోరఖ్ తో ప్రేమాయణం పెళ్లి ఇటువంటి తదితర ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి. కాగా రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఎంత కట్నం తీసుకున్నావు అన్న ప్రశ్నకు నేను కట్నం తీసుకోలేదు నాకు అసలు అలాంటి అంటే ఇష్టం ఉండవు.. అయితే మాత్రం వాళ్ళ కూతురుకి ఏమైనా నచ్చితే పెట్టుకుని.. అది వాళ్ల ఇష్టం’ అని ఎంతో హుందాగా తన మనసులో మాట చెప్పాడు. ప్రస్తుతం కిరణ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .
కాగా రాజావారు రాణిగారు సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు కిరణ్, రహస్య గోరఖ్. వీరిద్దరికి ఇదే మొదటి సినిమా. అంతుకు మందు సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేశారు. అయితే సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చారు. మొదటి సినిమా షూటింగ్ సమయంలోనే మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు. సుమారు ఐదేళ్లు ప్రేమలో మునిగితేలిన ఈ లవ్ బర్డ్స్ ఈ ఏడాది ఆగస్టు 22న పెళ్లిపీటలెక్కారు. కర్ణాటకలోని కూర్గ్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక క సినిమా ప్రమోషన్లలోనూ తళుక్కుమంది రహస్య. తన భర్తకోసమైనా ఈ సినిమాను చూడాలంటూ ప్రేక్షకులను కోరింది.