చాలామంది సినిమాని సినిమా గానే చూస్తూ ఉంటారు. ఏదైనా సినిమా షూటింగ్ కి వెళ్ళినప్పుడు ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందా..? ఇంటికి వెళ్ళామా..? మన పని మనం చూసుకున్నామా..? అంతవరకే ఆలోచిస్తూ ఉంటారు . అయితే చాలా తక్కువ మంది మాత్రమే సినిమాని సినిమాగా కాకుండా జీవితంలా భావిస్తూ ఉంటారు . వాళ్లలో నెంబర్ వన్ స్థానంలో ఎప్పుడు కూడా ఉంటారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు . సీనియర్ ఎన్టీ రామారావు గారి గురించి ఎంత చెప్పకున్న తక్కువే . సినిమా అంటే ప్రాణం ఇస్తాడు.  సినిమా కోసం ఆయన చేసిన త్యాగాలు ఎన్నెన్నో .


వాటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . కాగ  సీనియర్ ఎన్టీఆర్ తనతో వర్క్ చేసే హీరోయిన్స్ పట్ల ఎంత వినమ్రత భావం గా ఉంటాడు అని అందరికీ తెలిసిందే . చాలా రెస్పెక్ట్ ఇస్తాడు . అదేవిధంగా వాళ్లతో ఎంత హద్దుల్లో ఉండాలో కూడా ఉంటూ చాలా చాలా సరదాగా షూటింగ్లో ..షూటింగ్ సెట్స్ లో పాల్గొంటూ ఉంటారు.  అంతేకాదు సీనియర్ ఎన్టీ రామారావు గారి ఒక అలవాటు ఉంది . ఆయనతో వర్క్ చేసే హీరోయిన్స్ పుట్టినరోజు వస్తే ఆయన స్పెషల్ గా ఇంటి నుంచి చీర సారెతో సత్కరిస్తూ ఉంటారు . ఇంట్లో పిండి వంటలు చేసి మరి స్పెషల్ గా ఆ హీరోయిన్ కి ఇస్తూ ఉంటారు . అలా ఈ కాలంలో హీరోలు ఎవ్వరూ లేరు.



అయితే ఒకే ఒక్క హీరో మాత్రం అలా చేస్తూ సీనియర్ ఎన్టీ రామారావు గారిని గుర్తు చేస్తున్నారు.  ఆయన మరెవరో కాదు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి కొడుకు "బాలకృష్ణ". ఎస్ తండ్రి దగ్గర నుంచి ఈ అలవాటు బాగా బాలయ్యకు అబ్బింది . ఎంతలా అంటే ఇప్పటికీ బాలయ్య తన వర్క్ చేసే సినిమాలలో హీరోయిన్స్ బర్త డే వస్తే.. షూటింగ్లో బాగా సెలబ్రేట్ చేస్తారట.  అంతే కాదు ఇంటి నుంచి చీర - పూలు - పండ్లు - పిండి వంటలు తెప్పించి ఆ హీరోయిన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తూ ఉంటారు. గతంలో సీనియర్ ఎన్టీ రామారావు గారు ఇలాగే శ్రీదేవికి  ఆమె పుట్టిన రోజు నాడు చీర పువ్వులు అన్నీ ఇచ్చి సత్కరించారట.  అదేవిధంగా బాలయ్య కూడా భగవంత్ కేసరి సినిమా షూటింగ్ టైంలో శ్రీలీల బర్త డే  రావడంతో అలాగే సత్కరించారు . ఇప్పుడు ఈ తండ్రి కొడుకులను తెగ పొగడేస్తున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: