కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా సస్పెన్స్ థ్రిల్లర్ ‘క’ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగు వెర్షన్ టాలీవుడ్ అభిమానులు, సినీ ప్రేమికుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. సుజీత్, సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకుంటుంది. 'క' అనే ఒకే అక్షరాన్ని టైటిల్ పెట్టడంతో ఈ మూవీపై విడుదలకు ముందు నుంచే ఆసక్తి నెలకొల్పింది. క సినిమా కథ విషయానికి వస్తే....ఈ కథ 1977లో సాగుతోంది. హీరో కిరణ్ అబ్బవరం అభినయ వాసుదేవ్ అనే పాత్రలో నటించాడు. అభినయ వాసుదేవ్ ఓ అనాథ. తన బాల్యం మొత్తం ఓ అనాథాశ్రమంలో సాగుతోంది. అయితే ఈయనకు వేరే వాళ్ళ ఉత్తరాలు చదివే అలవాటు ఉంది. ఆ ఇంట్రెస్ట్ తోనే పెద్దయ్యాక క్రిష్ణగిరి అనే ఓ కొండ గ్రామంలో పోస్ట్ మ్యాన్ గా కూడా చేరతాడు.

ఆ క్రమంలో ఆ ఊరు పోస్ట్ ఆఫీస్ హెడ్ గా పనిచేస్తున్న రంగారావు కూతురు సత్యభామ తో ప్రేమలో పడతాడు వాసుదేవ్. ఈ కథ చాలా సంతోషంగా సాగిపోతున్నా  నమయంలో ఆ ఊళ్ళో అమ్మాయిలు కిడ్నాప్ అవుతుంటారు. ఆ విషయం ఆ ఊరిని భయాందోళనలకు గురి చేస్తోంది. దొంగతనంగా వేరే వాళ్ల లెటర్స్ చదివే వాసుదేవ్ కి ఓ ఉత్తరం ద్వారా అమ్మయిల మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఓ క్లూ దొరుకుతోంది. అలా మాయమవుతున్న అమ్మాయిలు ఏమవుతున్నారు? ముసుగు వ్యక్తి చెర నుంచి వాసుదేవ్, రాధ ఎలా బయటపడ్డారన్న యాంగిల్లో సెకండ్ ఆఫ్ సాగుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం తన నటనతో అందరిని ఆశ్చర్యపరిచాడు. 'క’ సినిమా తొలి రోజు కలెక్షన్స్‌తో రికార్డులు బద్దలు కొట్టింది. కిరణ్ అబ్బవరం కెరీర్‌లో ఇది అత్యధిక ఓపెనింగ్.

 సినీ విశ్లేషకుల అంచనాలను మించి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. క మూవీ డే 1 తెలుగు థియేటర్ ఆక్యుపెన్సీ చూస్తే మార్నింగ్ షో 53.17%, మధ్యాహ్నం షో 75.33%, సాయంత్రం షో 61.36%, నైట్ షో 74.25% ఆక్యుపెన్సీ సాధించింది. ఇలా మొదటి రోజు 'క' మూవీ ఓవరాల్ గా 66.03 శాతం ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంది. ఇలా క సినిమా తొలి రోజు దాదాపు రూ. 3.8 కోట్ల కలెక్షన్లు అందుకుంది. ఓ వైపు పండుగ, మరోవైపు వరుసగా హలీడేస్ ఉండటంతో మూవీ కలెక్షన్లు మరింత పెరుగుతాయని క సినిమా ద్వారా కిరణ్ అబ్బవరం కమ్ బ్యాక్ అవుతారని భావిస్తున్నారు అభిమాను. గత కొంతకాలంగా  కిరణ్ అబ్బవరం కు బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్ అందలేదు. వరుస ఫ్లాఫ్స్ అండ్ అండర్ పెర్ఫార్మ్ చేసిన సినిమాల రిజల్ట్ తర్వాత అంతా గ్యాప్ తీసుకుని క అనే డిఫెరెంట్ మూవీ తో తేర మీదకి వచ్చి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: