మహేష్ బాబు ఎంత డెడికేషన్ గా ఉంటారు అనే విషయం అందరికి తెలుసు. ఎంత డిసిప్లీన్ గా ఉంటారో అందరికి బాగా తెలుసు. ఐదు గంటలకి షూటింగ్ అంటే 4:50 కి అక్కడ ఉంటాడు .అలాంటి ఒక డేడికేషన్ మనస్తత్వం కలవాడు మన మహేష్ బాబు. కాగా మహేష్ బాబు తనతో వర్క్ చేసే హీరోయిన్స్ విషయంలో కూడా అలానే ఉంటాడు . ఎవరిని ఎక్కడ పెట్టాలి..? ఎంతలో పెట్టాలి..? ఎలా మాట్లాడాలి? ఎలా బిహేవ్ చేయాలి ..? అన్నది మహేష్ బాబుకి బాగా తెలుసు.  అందుకే ఆయనపై సోషల్ మీడియాలో ఈ హీరోయిన్ తో ఎఫైర్ ..ఆ హీరోయిన్ తో పెళ్లి అనే రూమర్స్ ఎప్పుడూ కూడా రావు.


ఇప్పటివరకు సోషల్ మీడియాలో అలా రూమర్స్ రాని ఏకైక హీరో మహేష్ బాబు మాత్రమే అని చెప్పాలి . కాగా మహేష్ బాబు అంటే అందరికి అదొక భయం . అంతేకాదు మహేష్ సిస్టర్స్ కి అలాగే మహేష్ బాబు కూతురు సితార కొడుకు గౌతమ్ కి కూడా మహేష్ బాబు అంటే చాలా భయం. చనువుగా మాట్లాడిన సరదాగా ఆటలు ఆడిన కొన్ని విషయాలు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా కంట్రోల్లో పెట్టేస్తూ ఉంటారు. అయితే అందరినీ కంట్రోల్లో పెట్టే మహేష్ బాబుకి ఓ లేడీ అంటే మాత్రం చాలా చాలా షివరింగ్. ఆమె మరి ఎవరో కాదు "నమ్రత శిరోద్కర్".



మహేష్ బాబుకి తన భార్య అంటే స్పెషల్ ప్రేమ రెస్పెక్ట్ తో పాటు భయం కూడా ఉందట . ప్రతిదీ కూడా ఆమె చాలా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతూ ఉంటుందట.  అంతేకాదు మహేష్ బాబుని ఇంట్లో ఎదిరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నమ్రత శిరోద్కర్  మాత్రమే .  దానికి కారణం ఆమె ఫేస్ టు ఫేస్ మాట్లాడే తత్వమే.  ఉన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేసే మనస్తత్వం కలిగిన నమ్రత  శిరోద్కర్ మంచి చేస్తే ఇది మంచి అని చెబుతుంది. చెడు చేస్తే అది తప్పు నువ్వు అలా ఇన్వెస్ట్ చేయకూడదు.. మనకు లాస్ వచ్చింది అంటూ తెగేసి మాట్లాడేస్తుందట . అందుకే మహేష్ బాబు ..నమ్రతతో మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని సార్లు షివర్ కూడా అవుతాడట . ఎక్కడ లాజిక్ లేని ప్రశ్నలు వేస్తుంది ఏమో అని భయమట. అంతలా మహేష్ బాబునే కంట్రోల్లో పెట్టేసుకునింది మహేష్ భార్య నమ్రత అంటూ జనాలు ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: