ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు చేసుకోవడం మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కొంతమంది ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటే మరి కొంతమంది చెప్పకుండా నిశ్చితార్థం చేసుకుని ఆ తర్వాత ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసి మేం పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ ప్రకటిస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ కొన్ని విషయాలు చూసి చూడనట్లు కూడా వదిలేస్తున్నారు. ఒకటో పెళ్లి రెండో పెళ్లి అంటూ సరదాగా నవ్వుకుంటున్నారు . అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పెళ్లి వార్త మాత్రం ఈ యంగ్ హీరో హీరోయిన్ అనే చెప్పాలి .


టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పాపులారిటి సంపాదించుకున్న ప్రభాస్ త్వరలోనే అనుష్కతో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్నా.. దానికి పూర్తిగా బ్రేక్ పడిపోయినట్లు అయింది.  మరి ముఖ్యంగా ప్రభాస్ తన మరదలు పిల్ల డాక్టర్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ టాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది . త్వరలోనే నిశ్చితార్థం జరగబోతుంది అంటూ కూడా భీమవరంలో ఉండే ప్రభాస్ దగ్గర బంధువుల దగ్గర నుంచి సమాచారం అందుతుంది . అయితే ఆయనకంటే ముందే మరొక యంగ్ హీరో పెళ్లి పీట్టలు ఎకబోతున్నారట .



ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో తన మొదటి హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతూ ఉన్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అఫ్కోర్స్ రీసెంట్గా పెళ్లి చేసుకున్న కిరణ్ అబ్బవరం - రహస్య గోరఖ్ కూడా అలాంటి స్పెషల్ రిలేషన్షిప్ నే. మొదటి సినిమాలో నటించి ఆ తరువాత ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.  కాగా ఇప్పుడు యంగ్ హీరో.. హీరోయిన్ కూడా అలాగే పెళ్లి చేసుకోబోతున్నారట . అసలు ఇంకా కెరియర్ లో సెటిల్ అవ్వకుండానే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉండడం ఫాన్స్ కి కూడా షాకింగ్ గా ఉంది . పట్టుమంటూ నాలుగు హిట్లు కూడా కొట్టకుండానే ఈ హీరో అప్పుడే పెళ్లి వరకు వెళ్లిపోతున్నాడు అంటూ ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . అయితే యంగ్ హీరోయిన్ మాత్రం పలు సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తుంది. రీసెంట్ గానే ఒక సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ కొట్టింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: