తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయిలో నిర్మాతగా కెరియర్ను ముందుకు సాగిస్తున్న వారిలో సూర్య దేవర నాగ వంశీ ఒకరు. ఈయన ఇప్పటికే సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను నిర్మించాడు. అలాగే ప్రస్తుతం కూడా వరుస పెట్టి సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు. ఈయన బ్యానర్లో వచ్చిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధిస్తూ వెళ్లడంతో ఈయన క్రేజ్ తెలుగులో రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నాగ వంశీ , దుల్కర్ సల్మాన్ హీరో గా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన లక్కీ భాస్కర్ అనే సినిమాను నిర్మించాడు.

మూవీ నిన్న అనగా అక్టోబర్ 31 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఇక ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన ఓ ఈవెంట్లో భాగంగా మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. తాజాగా నాగ వంశీ మాట్లాడుతూ ... మరి కొంత కాలం లోనే ఓ స్టార్ హీరోతో ఆ పొలిటికల్ మూవీ ని స్టార్ట్ చేస్తాను. దానిని 2029 ఎలక్షన్ల ముందు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అని చెప్పాడు.

కానీ ఆ సినిమాలో నటించబోయే స్టార్ హీరో ఎవరు అనే దానిపై మాత్రం నాగ వంశీ హింట్ ఇవ్వలేదు. మరి నాగ వంశీ ఏ స్టార్ హీరోతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేయాలి అనుకుంటున్నాడు అనే దానిపై పెద్దగా క్లారిటీ లేకుండా పోయింది. ఇకపోతే ప్రస్తుతం ఈయన చాలా సినిమాలను నిర్మిస్తున్నాడు. అందులో బాలయ్య , బాబి కాంబోలో రూపొందుతున్న సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: