టాలీవుడ్ స్టార్ హీరోలు ఎక్కువ శాతం తమ సినిమాలను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పటివరకు సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక సార్లు టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ వార్ జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ సినిమాలు కూడా సంక్రాంతి బరిలో పోటీపడ్డాయి. మరి ఆ సినిమాలు ఏవి .? అందులో ఏ మూవీ గెలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు , వెంకటేష్ హీరో గా రూపొందిన దేవిపుత్రుడు సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా భారీ అంచనాల నడుమ విడుదల కాపడంతో ప్రేక్షకులు ఈ రెండు మూవీలపై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక నరసింహ నాయుడు సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకోగా ... దేవి పుత్రుడు సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. ఇక నరసింహ నాయుడు ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది. దానితో ఆ సంవత్సరం నరసింహ నాయుడు సంక్రాంతి విన్నర్ గా నిలువగా ... దేవి పుత్రుడు యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోగలిగింది.

ఇకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతి భరిలో బాలయ్య , వెంకటేష్ మరోసారి బాక్సా ఫీస్ వార్ కి రెడీ అయ్యారు. బాలయ్య ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక వెంకటేష్ ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సారి సంక్రాంతి వార్ లో ఎవరు గెలుస్తారో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: