అయితే ప్రభాస్ ఓ వ్యక్తితో మాత్రం చాలా చనువుగా మూవ్ అవుతూ ఉంటారు . ఎంతలా అంటే అన్ని విషయాలలో చాలా స్ట్రిక్ట్ గా పద్ధతిలు పాటించే ప్రభాస్ ఆ వ్యక్తి పక్కనుంటే మాత్రం చాలా అల్లరి అల్లరిగా నాటి నాటిగా బిహేవ్ చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా ఆయన ఫోన్ తీసుకొని మరి ఫోన్ లోపల ఉండే ఫొటోస్ మెసేజెస్ కూడా చెక్ చేసే అంత చనువు. ఆ వ్యక్తితో ప్రభాస్ కి స్పెషల్ బాండింగ్ కూడా ఉంది . ఆయన మరెవరో కాదు "గోపీచంద్".
గోపీచంద్ - ప్రభాస్ ఎంత మంచి స్నేహితులు అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు - హీరోయిన్లు - డైరెక్టర్లు ఫ్రెండ్షిప్ చేసుకున్న విషయం మనకు తెలుసు . కానీ వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ మాత్రం అంతకుమించిన రేంజ్ లోనే ఉంటుంది. చాలా చనువు గా ఉంటారు. ఒకరి విషయాలు ఒకరు బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా స్టేజిపై చాలా సిగ్గు సిగ్గుగా బిడియం గా ఉండే ప్రభాస్ ..గోపీచంద్ పక్కన ఉంటే మాత్రం ఆయనలోని లోని ఎనర్జీ లెవల్స్ వేరే లెవెల్ లో ఉంటూ తన నాటినెస్ ను బయట పెడుతూ ఉంటాడు. అంత మంచి ఫ్రెండ్స్ గోపీచంద్ - ప్రభాస్. గోపీచంద్ - ప్రభాస్ హీరో - విలన్ గా వర్షం సినిమా వచ్చింది . ఆ తర్వాత వీళ్ళ కాంబోలో సినిమానే రాలేదు. వీళ్ళ కాంబోలో ఒక్క సినిమా అయినా రావాలి అంటూ కోట్లాదిమంది రెబల్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. బాహుబలి సినిమాలో అలాంటి ఆఫర్ ఇచ్చిన విలన్ పాత్రలు చేయకూడదు అంటూ గోపీచంద్ రిజెక్ట్ చేశారు . ఇక వీళ్లిద్దరిని కలిపి సినిమా తెరకెక్కించే సత్తా ఉన్న డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడో చూడాలి..?